యువకుడిగా వెళ్లి.. ముసలోడిగా బయటకు..! - MicTv.in - Telugu News
mictv telugu

యువకుడిగా వెళ్లి.. ముసలోడిగా బయటకు..!

June 26, 2017


ఇగో ఈ పోట్వల కన్పిస్తున్న తాత పేరు జాన్ ఫ్రాంజీస్.అమెరికాల ఒకప్పుడు పెద్ద తీస్మార్కాన్,మర్డర్లు దొంగతనాలు బ్యాంకుదోపీడీలు అని మస్తు కతలు వడ్డడు, పెద్ద గ్యాంగ్ స్టర్ అని పేరుగుడదెచ్చుకుండు,ఏదన్న గొప్పపని జేశి జైలు కోవుడు కొన్నేండ్లు ఉండుడు,మల్లా బైటికచ్చినంక మల్లా కతలువడి మల్లా జైలుకోవుడు ఇట్ల ఒకటిగాదు రొండుగాదు దగ్గరి దగ్గర 50 ఏండ్లు జైళ్లనే ఉన్నడు,సూశినోళ్లందరు వీన్కి జైళ్ల తిండి పెయ్యికి బాగ వట్టినట్టుంది అందుకే మల్లా మల్లా దొర్కిపోతుండు అన్కుండ్రట,ముసలితనాన్కి కుసుమ గుడాలన్నట్టు ..తొంబై ఏండ్లు నిండినంక గుడ బుద్ది వోనిచ్చుకోలే 93 వయసుల గుడ ఏదో తప్పు పనిజేశి దొర్కిపోయిండు,మొన్ననే 100 ఏండ్ల వయసుల బైటికచ్చిండు,అమెరికాల ఎక్కో ఏండ్లు జైళ్లున్న మన్షిగుడ గీయ్ననేనట,గ్యాంగ్ స్టర్ అయ్యి నేనేం సంపాయించిన్నో ఏం సాదించిన్నో గనీ నా బత్కంత జైళ్లనే ఒడ్శిపోయింది అని ఇప్పుడు మస్తు బాదవడ్తుండట,ఇప్పడిదాక చేసిన లంగపన్లు సాలు ఇగ మన్మలు మన్మరాళ్లతోని ముచ్చట వెట్కుంట పొద్దెళ్లదీస్తా అని జెప్తున్నడు,అయినా నువ్వేం గ్యాంగ్ స్టర్ వి తాత…గిన్నేండ్లచ్చినా గింత ఎక్స్ పీరియన్సున్నా తప్పు జేశినప్పుడల్లా పోలీసోళ్లకు దొర్కిపోతివి,అదే మాదేశంల జూడు..కోట్ల స్కాంలు ,వేలకోట్లు ముంచినోడు గుడ …మంచిగ ఖద్దర్ బట్టలేస్కొని,సూటు బూట్లు దొడుక్కొని చట్టానికి దొర్కకుంట ఎంత దర్జాగ బత్కుతున్రో.నువ్వేమో ఉత్తగనే పోలీసులకు దొర్కిపోయి గన్నేండ్లు ఊసలు లెక్కవెట్కుంట కూసుంటివి.దావూద్ ఇబ్రహీం గురించి ఇన్లే..ఆయన మాదేశంల పుట్టిన మోతెవరే,చట్టం కళ్లు ఎట్ల గప్పాలే,ఎట్ల తప్పించుకోవాలే అని ఒక్క ఫోన్గొట్టి అడ్గినా శెప్పెటోడు గావచ్చు.అయిందేదో అయిపోయింది గనీ ఈ కాన్నుంచైనా మంచిగ బత్కుతడో..లేక్పోతే అల్వాటైన పానంతోని మల్లేదన్న జేశి జైళ్ల శిప్పకూడు తింటడో..