old grandmother and her 24-year-old husband are willing to spend Rs 1 crore to have baby together
mictv telugu

భార్యకు 61, భర్తకు 24… సంతానం కోసం కోట్లలో ఖర్చు…

July 9, 2022

old grandmother and her 24-year-old husband are willing to spend Rs 1 crore to have baby together

ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలన్నది చాలా పాతమాట. డబ్బు, మనసు ఉంటే ఏ వయసులోనైనా కొరత లేకుండా ముచ్చట్లు తీసుకునే కాలమిది. 37 వయోభేదాన్ని లెక్క చేయకుండా ప్రేమించుకుని పెళ్లాడిన వింత జంట ఇప్పుడు తీరిగ్గా విచారించడం లేదుగాని సంతానం కోసం నానా తిప్పలూ పడుతోంది. సహజ గర్భం సాధ్యం కాకపోవడంతో కోట్లు గుమ్మరిస్తోంది.

ఇటలీకి చెందిన 61 ఏళ్ల బామ్మ చెరిల్ మెక్ గ్రెగెర్, 24 ఏళ్ల ఆమె భర్త కురాన్ మెక్ కెయిన్ కథ ఇది. వీరు గత ఏడాది సెప్టెంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. తమ అనురాగానికి చిహ్నంగా బిడ్డను కనాలనుకున్నారు. కానీ మెక్‌ గ్రెగర్‌కు వయసైపోవడంతో గర్భం దాల్చడం సాధ్యం కాదని డాక్టర్లు చెప్పారు. అయితే అద్దె గర్భం ట్రై చేస్తామంది జంట. డాక్టర్లు సరేనని సరోగసీకి ఏర్పాట్లు చేశారు. బిడ్డను కనివ్వడానికి ఓ మహిళ ముందుకొచ్చింది. ఐవీఫ్, ఇతరత్రా ఖర్చులకు ఇప్పటికే రూ. 1.14 కోట్లు ఖర్చుపెట్టిందీ వింత జంట. సదరు సరోగసీ తల్లి త్వరలోనే బిడ్డ కనబోతోంది. తొలి భర్త ద్వారా మెక్ గ్రెగెర్’కు ఏడుగురు పిల్లలు, 17 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అంటే రేపోమాపో పుట్టబోయే బిడ్డ ఆమె మనవళ్లకు బాబాయో, పిన్నో ఆల్రెడీ అయిపోయినట్టే లెక్క. ఈ కథలో ట్విస్ట్ ఏమంటే.. మెక్ మెయిన్‌ను మెక్ గ్రెగర్ తొలిసారి చూసి తొలి చూపులోనే ప్రేమలో పడినప్పుడు అతని వయసు 15 ఏళ్లు.