old harley davidson motrcycle got went for 7.75 crores in auction
mictv telugu

ఓల్డ్ ఈజ్ గోల్డ్….సూపర్ రిచ్ సైకిల్

February 14, 2023

old harley davidson motrcycle got went for 7.75 crores in auction

సైకిల్ తొక్కకుండా ఏ జీవితమూ వెళ్ళదు మాక్జిమమ్. చిన్నతనంలో సైకిల్ తొక్కడం ఓ సరదా. పెద్దయ్యాక ఎక్సర్సైజ్. దీని కోసం అందరూ సైకిల్ కొనుక్కుంటారు. అలాంటి ఇది ఎంత ఉంటుంది మహా అయితే వేలల్లో….పోనీ లక్షల్లో. అంతే కదండీ. కానీ ఒక సైకిల్ ఉంది. దాని ధర ఎంతంటే మనం వూహించలేనంత. అక్షరాలా ఏడున్నర కోట్లు. హమ్మ బాబోయ్….ఒక సైకిల్ అంత కాస్టీలీయా అనిపిస్తోంది కదా. రండి చూద్దాం దాని కథామకమామీషు ఏంటో.

హార్లీ డేవిడ్ సన్….దీని గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఈ బైక్ లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీన్ని డ్రైవ్ చేస్తుంటే వచ్చే కిక్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది అంటారు. అలాగే హార్లీ బైక్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అయితే హార్లీ సంస్థ ఇప్పటిది కాదుట.ఎప్పుడో 1908లోనే ఈ సంస్థ వెహికలస్ ని తయారు చేసిందట. అలా అప్పుడు తయారు చేసిన సైకిలే ఇవాళ 7.75 కోట్లకు అమ్ముబోయింది. అందుకేనేమో ఓల్డ్ ఈ జ్ గోల్డ్ అంటారు.

హర్లే డేవిడ్ సన్ స్ట్రాప్ ట్యాంక్ మోటార్ సైకిల్ అమెరికాలో లాస్ వెగాస్ లో మెకమ్ వేలంలో అమ్మారు. వేలంలో ఓ వ్యక్తి ఈ సైకిల్ ని 9 లక్షల 35 వేల డాలర్లకు వెళ్ళింది. సేమ్ ఇలాంటి సైకిళ్ళనే హార్లే 1908లో 450 తయారు చేసింది. వాటిల్లో ఇప్పటికీ పాడవకుండా మిగిలిన దాన్ని ఇలా వేలం వేశారు. ఈ సైకిల్ వయసు 110 ఏళ్ళు అయినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా అట్రాక్టివ్ గా ఉంది.