Old jeans into sleeping bags for the homeless in delhi
mictv telugu

పాత జీన్స్.. నిరాశ్రయులు కప్పుకొనేలా స్లీపింగ్ బ్యాగ్స్!

November 22, 2022

జీన్స్‌లు పాతగా అయ్యాయని పాడేస్తే అవి రీసైకిల్ చేయడానికి చాలా కాలం పడుతుంది. అంతేకాదు.. వాటి వాడకం వల్ల నీటిని కూడా ఎక్కువగా వాడేస్తున్నారని తెలిసి వాటిని స్లీపింగ్ బ్యాగులుగా కుట్టిస్తున్నాడో అబ్బాయి.వేగంగా ఫ్యాషన్ ప్రపంచం అభివృద్ధి చెందుతున్నది. అందుకు తగ్గట్టుగానే వాతావరణ కాలుష్యాన్ని కూడా పెంచుతున్నాం. ఒక జీన్స్ మొత్తం కలిసి పోవాలంటే కొన్ని యేండ్లు పడుతాయి.

బ్లూ జీన్స్.. గ్రీన్ జీన్స్ అవ్వాలంటే తనతో చేయి కలుపమంటున్నాడు ఢిల్లీకి చెందిన 16యేండ్ల నిర్వాన్. ఒక జీన్స్‌ని దాని జీవితకాలంలో ఉతుకాలంటే దాదాపు 10వేల లీటర్ల నీటిని ఉపయోగించాలి. నగరాల్లో ఒక రోజుకు ఒకరికి 135 లీటర్ల నీరు మాత్రమే వస్తుంది. అదే గ్రామాల్లో 55లీటర్లే. అందరం కలిపి రోజుకు 100లీటర్ల నీటిని వాడుతున్నాం. 100 రోజులకు 10వేల లీటర్ల నీటిని ఉపయోగిస్తాం. గ్రామాల్లో ఇదే నీటిని వాడడానికి 180 రోజులు తీసుకుంటున్నారు. మరి ఒక మనిషికి నీరు దొరకడమే కష్టంగా ఉన్నకాలంలో జీన్స్ కోసం నీటిని వృథా చేస్తున్నామని తెలుసుకున్నాడు నిర్వాన్. అది తెలిశాక చాలా బాధపడ్డాడు.

ఈ విషయం తెలిసి ప్రతీ ఒక్కరూ.. షాక్ అయ్యారు కదా! 2019లో ఈ విషయం తెలిసిన నిర్వాన్ పరిస్థితి కూడా ఇదే! ఈ పాత జీన్స్‌లను ఎలా రీసైకిల్ చేయాలి అని అనుకున్నాడు. యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అకాడమీలో ఒకసారి పాల్గొన్నాడు. అప్పుడే ఈ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ల కుటుంబ సభ్యులు చలికాలం వస్తే.. పాత జాకెట్లు, రగ్గులు ఇవ్వడం చూశాడు. వెంటనే ఓ ఐడియా వచ్చేసింది. వాడి పడేసే బదులు ఆ జీన్స్‌తోనే ఫుట్‌పాత్ మీద పడుకొనే వారికి స్లీపింగ్ బ్యాగులు కుట్టివ్వాలి అనుకున్నాడు. ఈ అబ్బాయి తల్లి శివాని బట్టల బిజినెస్‌లోనే ఉంది.

ఈ బ్యాగులు కుట్టించడం పద్ద కష్టమేమీ కాదు అనుకున్నాడు. ఆరు నెలల్లో 1400 జీన్స్‌లను సేకరించాడు. ఒక స్లీపింగ్ బ్యాగ్ చేయడానికి ఏడు జీన్స్‌లు కావాల్సి ఉంటుంది. ముందుగా బెల్ట్, కాళ్లను కట్ చేసేస్తారు. మిగిలిన వాటిని కూడా కావాల్సిన చోట వాడేస్తారు. చలికి తట్టుకునేలాగే ఈ బ్యాగులను తయారుచేస్తున్నారు. ఈ పని చేయడానికి పదిమంది ఆడవాళ్లను నియమించాడు. ఈ పని ద్వారా వారికి కూడా ఉపాధి కలుగుతున్నది. రోజుకు ఒక బ్యాగ్ చొప్పున కుడుతున్నారు. అలా నెలకు 300ల బ్యాగులను కుడుతున్నారు. ఒక్కోదానికి సుమారు 800 రూపాయలు ఖర్చు చేస్తున్నాం అంటున్నాడు నిర్వాన్. ఇప్పటి వరకు 112 స్లీపింగ్ బ్యాగ్‌లను కుట్టగలిగారు. ఈ నెల చివరికల్లా ఇంకో 50వరకు కుట్టే ప్రయత్నంలో ఉన్నారు.

రాబిన్ హుడ్ ఆర్మీతో కలిసి ఈ రోజు నుంచి వీటిని ఢిల్లీలోని నిర్వాసితులకు పంచబోతున్నారు. అంతేకాదు.. వీటిని అమ్మాలని కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే.. కొందరు తమలాగే పంచాలనుకుంటారు. వాళ్లు వీటిని కొనుగోలు చేయొచ్చు. ‘ఇప్పటివరకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ పనులను చేశాం. ఎవరైనా కొనడానికి ముందుకొస్తే మా పని మరింత సులువవుతుంది’ అంటున్నది నిర్వాన్ తల్లి శివాని. ‘నేను ముందుగా వాట్సాప్‌లో మెసేజ్ పంపాను. ఆ తర్వాత ఇన్‌స్టాలో పేజీ మొదలు పెట్టా. ముగ్గురుతో ఈ ప్రాజెక్ట్ జీన్స్ మొదలుపెట్టా. ఇప్పుడు ఎంతోమంది ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. చెన్నై, ముంబై, పుణె.. ఇతర నగరాల నుంచి కూడా మాకు జీన్స్ అందుతున్నాయి. డెనీమ్ జీన్స్ ఒక్కటే ఎన్ని రోజులు అయినా పాతబడవు. అందుకే వీటినే వాడాలని అనుకున్నా’ అంటున్నాడు నిర్వాన్.