8 నెలలుగా ఇంట్లోనే బందీగా.. అడిక్‌మెట్‌లో దారుణం - MicTv.in - Telugu News
mictv telugu

8 నెలలుగా ఇంట్లోనే బందీగా.. అడిక్‌మెట్‌లో దారుణం

February 27, 2020

fvb cvb

లేటు వయసులో కూడా ఓ ముసలోడు తన శాడిజాన్ని చూపించాడు. తన జీవిత భాగస్వామిగా చేసుకొని చాలా ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన భార్యను ఒంటరిని చేశాడు. అద్దె ఇంట్లో ఆమెను ఒంటరిగా వదిలేసి ఇంటి బయట తలుపునకు తాళం వెసి వెళ్లిపోయాడు. సుమారు ఎనిమిది నెలలుగా ఆమె అదే ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. హైదరాబాద్‌లోని అడిక్ మెట్‌లో జరిగిన ఈ ఘటనపై ఇంటి యజమానురాలు సాయంతో ఆమెకు విముక్తి లభించింది. 

కృష్ణా జిల్లా నాగాయలంక వీఆర్వోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన గంగాధర్ అనే వ్యక్తి ఇటీవల తన భార్య బేబి(72)తో కలిసి హైదరాబాద్ వచ్చాడు. అడిక్ మెట్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. తమకు వ్యవసాయ భూమి ఉండటంతో దాన్ని అమ్మేందుకు తాను ఊరికి పనుల మీద వెళ్తున్నట్టు భార్యకు చెప్పి ఇంటి బయట తాళం వేసుకొని వెళ్లిపోయాడు. ఇలా వెళ్లిన వాడు ఎనిమిది నెలలు అయినా తిరిగి రాలేదు. ఇంటి యజమానురాలు ఫోన్ చేసినా కొన్నిసార్లు స్పందించలేదు. మూడు నెలల క్రితం త్వరలోనే వస్తానని చెప్పి ఆచూకీ లేకుండా పోయాడు.

తన భర్త తిరిగి వస్తాడని ఆమె చూస్తూనే ఉండిపోయింది. దిక్కు మొక్కూ లేక ఆ బామ్మ ఇంట్లోనే ఎనిమిది  ఉండటంతో ఆ అద్దె ఇంటి యజమానురాలు మానవత్వం చూపి, రోజూ పలకరిస్తూ అన్నం పెట్టి ఆదుకుంటోంది. ఈ విషయం పోలీసులు స్పందించి ఎట్టకేలకు ఆమెకు విముక్తి కలిగించారు. ఆమెను వృద్ధాశ్రమానికి తరలించారు. అతని ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఆమెను వదిలించుకోవడానికే గంగాధర్ ఇలా చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.