కళ్లు మూసుకుపోయిన కామాంధుడు.. ఆవుపై అఘాయిత్యం - MicTv.in - Telugu News
mictv telugu

కళ్లు మూసుకుపోయిన కామాంధుడు.. ఆవుపై అఘాయిత్యం

July 8, 2020

 

bcv ngcvb

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పశువులు కూడా సిగ్గుపడేలా వ్యవహరించాడు. మూగజీవి అనే కనికరం కూడా లేకుండా ఓ 55 ఏళ్ల వృద్ధుడు ఆవుపై అఘాయిత్యం చేశాడు. మధ్యప్రదేశ్‌లో దారుణం సంఘటన చోటుచేసుకుంది. ఎవరూ చూడని సమయంలో తెల్లవారు జామున 4.00 గంటలకు ఈ అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

భోపాల్‌లోని సుందర్ నగర్‌ ప్రాంతంలో ఓ ఇంటి బయట కట్టేసి ఉన్న ఆవుపై లైంగిక దాడికి దిగాడు. జులై 4న ఈ దారుణానికి ఒడిగట్టగా.. ఆవు అరవడంతో యజమాని బయటకు వచ్చి చూశాడు. సమయం గడిచే కొద్ధి అది అస్వస్థతకు గురైంది. అనుమానంతో సీసీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి  వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఆవుపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలడంతో అతన్ని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువులను కూడా వదలని ఇలాంటి క్రూరులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.