పని ఇప్పించండి సారూ..70 కి.మీ సైకిల్ తొక్కిన 73 ఏళ్ల దివ్యాంగుడు - MicTv.in - Telugu News
mictv telugu

పని ఇప్పించండి సారూ..70 కి.మీ సైకిల్ తొక్కిన 73 ఏళ్ల దివ్యాంగుడు

July 7, 2020

 bngnf

లాక్‌డౌన్‌తో జీవితాలు భారంగా మారిపోయాయి. సరైన ఉపాధి లేక పూట గడవక చాలా కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. చేసుకుందామంటే పని లేకపోవడంతో దుర్భర జీవితాన్ని అనుభిస్తున్నారు. ఇలాంటి ఘటనే తమిళనాడులో వెలుగు చూసింది. ఉపాధి కోల్పోయిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వ సాయం కోసం ఏకంగా 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ఆ వయసులో అతడు పడుతున్న బాధను చూసిన వారంతా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తీరా అధికారుల చొరవతో అతడికి ప్రభుత్వ సాయం అందించేందుకు ఏర్పాట్లు చేయాలనే ఆదేశాలు వచ్చాయి. 

తంజావూర్‌ జిల్లా ఏనానల్లూర్‌కు చెందిన నటేశన్‌ (73) అనే దివ్యాంగుడు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. పని లేని సమయంలో ముగ్గు పిండి అమ్మేవాడు. ఇటీవల కరోనా దెబ్బతో అన్ని ఉపాధి పనులు దెబ్బతినడంతో అతని జీవితం భారంగా మారింది. తనకు దివ్యాంగుల కోటాలో సాయం అధించాలని స్థానిక అధికారుల చుట్టూ తిరిగే వాడు. ఓ రోజు అతన్ని కుంభకోణంలోని వైద్య అధికారి నుంచి సర్టిఫికెట్ తేవాలని సూచించారు. రవాణా సదుపాయం సరిగా లేకపోవడంతో సైకిల్‌పై బయలుదేరాడు. తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి 11 గంటలకు తంజావూరులోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. అధికారులు స్పందించి వెంటనే అతనికి కావాల్సిన ధ్రువపత్రం అందించారు. దాన్ని ఎమ్మార్వో కార్యాలయంలో అప్పగిస్తే సరిపోతుందని చెప్పి పంపించారు.