లాకర్ రూంలో 85 ఏళ్ల వృద్ధుడు.. ఎలా జరిగిందంటే - MicTv.in - Telugu News
mictv telugu

లాకర్ రూంలో 85 ఏళ్ల వృద్ధుడు.. ఎలా జరిగిందంటే

March 29, 2022

bnmb

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 85 ఏళ్ల ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంకులోనే ఉండిపోవాల్సి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం యూనియన్ బ్యాంకులో లాకర్ రూంలో పని ఉండి ఓ వృద్ధుడు బ్యాంకుకు వచ్చాడు.పనిలో పడి బ్యాంకు పనివేళలు ముగిసినా ఆ వృద్ధుడు గమనించలేదు. సిబ్బంది కూడా ఈ విషయం గమనించకుండా తాళం వేసుకొని వెళ్లిపోయారు. కాగా, చీకటి పడినా వృద్ధుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు చెక్ చేయగా, చివరగా బ్యాంకులో ప్రవేశించినట్టు తేలింది. దాంతో మరుసటి రోజు ఉదయం తాళం తెరచి చూసేసరికి వృద్ధుడు లాకర్ రూంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వృద్ధునికి షుగర్ వ్యాధి ఉండడంతో స్పృహ తప్పి పడిపోయి ఉంటాడని, రాత్రంతా అన్న పానీయాలు లేకపోవడంతో ఆరోగ్యం క్షీణించిందని కుటంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా, బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం పట్ల పోలీసులు విచారణ చేస్తున్నారు. లోపం ఎక్కడ జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు.