పాత నోట్ల డిపాజిట్ కు మరో ఛాన్స్..? - MicTv.in - Telugu News
mictv telugu

పాత నోట్ల డిపాజిట్ కు మరో ఛాన్స్..?

July 4, 2017

మీ దగ్గర పాత నోట్లు ఉన్నాయా… ఎందుకు పనికిరావని గూట్లో వేశారా…డోంట్ వర్రీ…ఒక్కసారి ఎక్కడ పెట్టారో గుర్తు చేసుకోండి. ఎందుకంటే మళ్లీ డిపాజిట్ చేసుకునే అవకాశం రాబోతోంది. మళ్లీ త్వరలో బ్యాంక్ బాట పట్టండి.కాకపోతే కొన్ని కండీషన్స్ పెట్టారు. రూల్స్ ఏంటంటే..

డీమానిటైజేషన్ టైమ్ లో పాత రూ.500, వెయ్యి నోట్ల‌ను డిపాజిట్ చేయ‌లేక‌పోయిన వారి కోసం మ‌రో అవ‌కాశం క‌ల్పించాల‌ని సుప్రీంకోర్టు ఆర్బీఐతో పాటు కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరింది. స‌రైన కార‌ణాలు ద్రువ‌ప‌రిచే వ్య‌క్తుల నుంచి పాత నోట్ల‌ను స్వీక‌రించేందుకు ఏదైనా ఒక ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని ఆర్బీఐని కోరింది. ఈ ప్ర‌ణాళిక‌పై రెండు వారాల్లోగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్రంతో పాటు ఆర్బీఐకి సుప్రీం డెడ్‌లైన్ పెట్టింది. నోట్ల ర‌ద్దు కేసులో మ‌ళ్లీ అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు బెంచ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. జూలై 18న సుప్రీంకోర్టు ఇదే అంశంపై మ‌ళ్లీ విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ది. గ‌త డిసెంబ‌ర్ 30 వ‌ర‌కు మాత్ర‌మే డిమోనిటైజ్డ్ నోట్ల‌ను స్వీక‌రించాల‌ని నిర్ణ‌యించిట‌న్లు కేంద్రం త‌న నివేదిక‌లో సుప్రీంకోర్టుకు తెలిపింది. కేవ‌లం ఎన్నారైల‌కు మాత్రం కొంత మార్చి 31 వ‌ర‌కు వెస‌లుబాటు క‌ల్పించారు. డిమోనిటైజేష‌న్ త‌ర్వాత సుమారు 5400 కోట్ల అక్ర‌మ సొమ్మును స్వాధీనం చేసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ర‌ద్దు అయిన నోట్లను మ‌ళ్లీ డిపాజిట్ చేసే అంశంలో ప్ర‌భుత్వం ఎటువంటి కొత్త నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసేందుకు సిద్ధంగా లేన‌ట్లు తెలుస్తోంది.