పాకిస్తాన్‌లో బయటపడ్డ 1300 ఏళ్ల నాటి హిందూ ఆలయం  - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌లో బయటపడ్డ 1300 ఏళ్ల నాటి హిందూ ఆలయం 

November 20, 2020

పాకిస్తాన్‌లో అత్యంత పురాతన హిందూ ఆలయం బయటపడింది. 1300 ఏళ్ల కిందట నిర్మించిన విష్ణువు ఆలయాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు  గుర్తించారు. దేశ వాయవ్య ప్రాంతంలోని స్వాత్ జిల్లా బరీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఇది బయపడింది. క్రీస్తుశకం 7వ శతాబ్దాల్లో దీన్ని నిర్మించి ఉంటారని  పాక్ పురావస్తుశాఖ అధిపతి ఫజల్ ఖాలిక్ వెల్లడించారు. గుడి ప్రాంతంలో కోట బురుజులు, మండపాలు, పుష్కరిణి కూడా కనిపించాయి. 

స్వాత్ ప్రాంతాన్ని పాలించిన హిందూ షాహి ఏలుబడితో ఈ ఆలయాన్ని నిర్మించారని ఆయన వెల్లడించారు. క్రీ.శ. 850-1026 మధ్య కాలంలో ఈ ప్రాంతం హిందూ షాహీలో పాలనలో ఉచ్ఛదశకు చేరుకుంది. ఈ పాలకులను కాబూల్ షాహీలు అని కూడా అంటారు. స్వాత్ లోయలో ఒకప్పుడు బౌద్ధమతం వర్ధిల్లింది. తర్వాత ముస్లిం పాలకుల హయంలో అస్థితర నెలకొంది. తాలిబాన్ ఉగ్రవాదులు అక్కడి బౌద్ధారామాలను, విగ్రహాలను నేలమట్టం చేశారు.