‘బుమ్రా’ బామ్మ.. బౌలింగ్ చూడండి  - MicTv.in - Telugu News
mictv telugu

‘బుమ్రా’ బామ్మ.. బౌలింగ్ చూడండి 

July 13, 2019

టీమిండియా స్వింగ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ స్టయిలే వేరు. ప్రత్యర్థి ఆటగాళ్లు బుమ్రా బౌలింగ్ అంటేనే భయపడిపోతుంటారు. ఇటీవల ప్రపంచ కప్‌లో కూడా బుమ్రా బౌలింగ్‌కు ఆటగాళ్లు అతలాకుతలమైన విషయం తెలిసిందే. అలాంటి బుమ్రా బౌలింగ్ చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ బామ్మ కూడా ఇలాగే బుమ్రా బౌలింగ్‌ను ఇమిటేట్ చేసింది. ఆ వీడియోను ఓ యువతి ట్విట్టర్‌లో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్ అయ్యింది. 

ఈ వీడియోను చూసిన బుమ్రా స్పందిస్తూ.. ‘ఈ వీడియో నాకు చాలా సంతోషాన్ని కలిగించింది’ అంటూ ట్వీట్ చేశాడు. బుమ్రా బౌలింగ్‌ను ఇమిటేట్ చేసిన బామ్మ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు.