టాయిలెట్‌లో నివాసం.. వృద్ధురాలి దీనగాధ - MicTv.in - Telugu News
mictv telugu

టాయిలెట్‌లో నివాసం.. వృద్ధురాలి దీనగాధ

August 23, 2019

నిలువ నీడలేక పబ్లిక్ టాయిలెట్‌ను ఓ 65 ఏళ్ల వృద్దురాలు తన నివాసంగా చేసుకుంది.ఎవరూ తనను పట్టించుకోకపోవడంతో ఆమె ఒంటరిగా 19 ఏళ్ల నుంచి అందులోనే కాలం వెళ్లదీస్తోంది. అక్కడే టాయిలెట్లు శుభ్రం చేస్తూ.. అక్కడికి వచ్చిన వారు ఇచ్చే రూాపాయి రూపాయి కూడబెట్టి వాటితోనే జీవనం సాగిస్తోంది. మధురైలోని రామ్‌నాథ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ‘కరుప్పె’ అనే మహిళలను ఆంగ్ల మీడియా సంస్థ పలకరించగా ఈ విషయాలను వెల్లడించింది.

ప్రతిరోజు టాయిలెట్‌కు వచ్చే వారి నుంచి వసూలు చేసే డబ్బు రూ. 70 నుంచి 80 వరకు సమకూరుతాయని చెప్పింది. వాటినే తన జీవనం కోసం ఉపయోగించుకుంటానంటోంది. అప్పట్లో ఎవరో ఫెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పినప్పటికీ  ఫలితం లేదని తెలిపింది. కలెక్టర్‌ను కు మొరపెట్టుకున్నా పెన్షన్ రావడం లేదనీ వాపోయింది. తనకు ఓ కూతురు కూడా ఉందనీ కానీ ఆమె ఏనాడు పట్టించుకోలేదని కన్నీరు పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన వారంత చలించిపోతున్నారు. ఆమె దీనగాధ చూసి అయ్యే అనుకుంటున్నారు.