Old woman tragedy Visakhapatnam anganwadi land acquisition issue
mictv telugu

ఏపీలో ఘోరం.. వృద్ధురాలిని తొక్కి చంపిన సర్కారీ జేసీబీ

October 28, 2022

ప్రభుత్వం జరుపుతున్న స్థల సేకరణను అడ్డుకున్న జనంపై సర్కారీ జేసీబీ దుర్మార్గానికి పాల్పడింది. ఓ వృద్ధురాలిని తొక్కి చంపేసింది. విశాఖపట్నం ఆనందపురం మండలం పొడుగు పాలెంలో ఈ ఘోరం జరిగింది. అంగన్‌వాడీ భవన నిర్మాణానికి స్థల సేకరణ పేరుతో అధికారులు అక్కడి గుడిసెలను జేసీబీతో కూలదోశారు. శివాలయం రోడ్డులోని సదరు భూమిలో తమ తాత ముత్తాల కాలం నుంచి పశువుల పాకలు వేసుకుని ఉంటున్నామని ప్రజలు అభ్యంతరం చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. వారి ఆదేశంతో జేసీబీని డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. అయినా ప్రజలు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో అడ్డుకున్న ఎల్లమ్మ(80) అనే వృద్ధురాలిని జేసీ తొక్కి చంపింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మృతురాలి కుమారుడు ప్రభుత్వాధికారులపై, వైకాపా నేతలపై కేసు పెటారు. వైసీపీ సర్పంచ్, అధికారులను అరెస్టు చేయాలని కోరుతున్నారు. తమ తల్లి వారి అన్యాయాలను ప్రశ్నిస్తుండేదని, కక్ష గట్టి కూల్చివేతల సాకుతో చంపేశారని ఆరోపించారు.