అంత్యక్రియలకు డబ్బు దాచుకుని.. ఆ నోట్లు రద్దయ్యాయని తెలిసి.. - MicTv.in - Telugu News
mictv telugu

అంత్యక్రియలకు డబ్బు దాచుకుని.. ఆ నోట్లు రద్దయ్యాయని తెలిసి..

November 28, 2019

కష్టపడే తత్వం..ఒకరిపై ఆధారపడి జీవించకూదనే నైజం ఆ ఇద్దరు అక్కా చెళ్లెల్లది. ఏనాడైనా మరణం రాక తప్పదు కాబట్టి.. అప్పుడు ఎవరిపైనా ఆధారపడకూడదని సొంతంగా అంత్యక్రియలకు డబ్బు కూడబెట్టుకుంటూ వచ్చారు. ఇద్దరూ కలిసి దాదాపు రూ.46 వేలు కూడబెట్టారు. కానీ 2016లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయంతో వారు కూడబెట్టిన డబ్బు పనికిరాకుండా పోయింది. ఈ విషయం మూడు సంవత్సరాలైనా వారికి తెలియలేదు. ఇటీవల డబ్బు అవసరం కావడంతో ఈ విషయం బయటపడింది. నోట్లు చెల్లవని తెలిసి వారిద్దరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Old Women.

తమిళనాడులోని తిరుప్పూరు జిల్లా పూమలూరుకు చెందిన రంగమ్మాళ్‌ (75),తంగమ్మాళ్‌(72) ఇద్దరు అక్కా చెళ్లెల్లు. వారి భర్తలు చనిపోవడంతో ఇద్దరూ కలిసి పశువులను మేపుకుంటూ జీవిస్తున్నారు. వీరిలో రంగమ్మాళ్‌కు ఏడుగురు, తంగమ్మాళ్‌కు ఆరుగురు సంతానం. వారంత వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అయినా వారిపై ఆధారపడకుండా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అంత్యక్రియలకు కూడా తామ డబ్బే వాడాలని ఎవరికి తెలియకుండా  కొంత కొంత కూడబెట్టుకుంటున్నారు. ఇటీవల తంగమ్మాళ్ అనారోగ్యానికి గురి కావడంతో తాను గోడలో దాచిన సొమ్ములో కొంత డబ్బు తీసుకురావాలని చెప్పింది. అతడు అక్కడికి వెళ్లి చూడగా అందులో రూ.500,రూ.1000 వరకు చెల్లని పాత నోట్లు రూ. 24 వేల వరకు ఉన్నాయి. అవి చెల్లవని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. తన వద్ద కూడా అవే నోట్లు ఉన్నాయని రంగమ్మాళ్ చెబుతూ విలపించింది. 

రోజువారి ఖర్చులకు తమ సంతానం డబ్బులు ఇస్తుండటంతో.. పశువులు మేపడం ద్వారా వచ్చిన డబ్బు తమ అంత్యక్రియల కోసం ఇలా దాచుకుంటున్నాం అని ఇద్దరూ చెప్పారు. నిరాక్షరాస్యులు, లోకం పోకడ తెలియని వారు రద్దు విషయాన్ని గుర్తించలేకపోయారు. ఎప్పుడూ పశువులను మేపుకోవడమే వారి జీవితం కావడంతో ఈ విషయాలేవి వారికి తెలియలేదు. మూడేళ్ల క్రితం ఈ నోట్లు రద్దు అయినా వారు తెలుసుకోలేదు. దీంతో పాత నోట్లను మార్చుకోకుండా అలాగే భద్రపరుచుకున్నారు. ఇటీవల ఈ విషయం తెలిసి తాము కష్టపడిన సొమ్ము వృథా అవుతుందని వాపోతున్నారు. ఎలాగైనా తమ నోట్లను మార్చుకునే అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు.