రేపటినుంచి ఐఫోన్-5 మౌనం.. అప్‌డేట్ చేసుకోకపోతే అంతే.. - MicTv.in - Telugu News
mictv telugu

రేపటినుంచి ఐఫోన్-5 మౌనం.. అప్‌డేట్ చేసుకోకపోతే అంతే..

November 3, 2019

మీది 2012లో వచ్చిన ఐఫోన్ 5నా? అయితే అది రేపటినుంచి పనిచేయదు. వెంటనే దానిని అప్‌డేట్ చేయించుకుంటే తప్ప అది పనిచేయదు. ఐఫోన్ 5 వారి ప్రస్తుత ఐఓస్ వెర్షన్ నుండి ఐఓస్ వెర్షన్ 10.3.4 కు నవంబర్ 3 నాటికి అప్‌డేట్ కావాలి, లేకపోతే ఐక్లౌడ్, యాప్ స్టోర్ వంటి ఫంక్షన్లు ఇకపై వారి ఫోన్‌లో పనిచేయవని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈరోజు (నవంబర్ 3, 2019) మధ్యాహ్నం 12:00 గంటల లోపు ముందే అప్‌డేట్ చేయించుకోవాలని సంస్థ తెలిపింది. యుటీసీ నుంచి, ఐఫోన్ 5కి కచ్చితమైన జీపీఎస్ స్థానాన్ని ఇంకా యాప్ స్టోర్, ఐక్లౌడ్, ఈమెయిల్, వెబ్ బ్రౌజింగ్ నిర్వహించడానికే అప్‌డేట్ చేసుకోవాలని వెల్లడించింది. 

Iphone 5.

నవంబర్ 3, 2019 నాటికి ఐఫోన్5 అప్‌డేట్  పూర్తి కాకపోతే, అప్‌డేట్ చేయడానికి మాక్ లేదా పీసీని ఉపయోగించి బ్యాకప్ చేసి పునరుద్ధరించాల్సి ఉంటుంది.  ఎందుకంటే ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇంకా ఐక్లౌడ్ బ్యాకప్ పనిచేయవు అని ఆపిల్ తెలిపింది. ఫోన్ అప్‌డేట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే.. మీ ఫోన్‌లో ‘సెట్టింగ్స్’ ఆప్షన్‌ని ఓపెన్ చేయాలి. సరికొత్త సాఫ్ట్‌వేర్ సంస్కరణను తెలుసుకోవడానికి ‘జనరల్’ ఆప్షన్‌ను  నొక్కాలి. ఆతర్వాత ‘అబౌట్’ ఆప్షన్ పై నొక్కాలి. అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ వెర్షన్ సంఖ్య 10.3.4 ఉంటే అప్‌డేట్ అయినట్టే.