‘ది కశ్మీర్ ఫైల్స్’ వెనుక ఉగ్ర కుట్ర.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

‘ది కశ్మీర్ ఫైల్స్’ వెనుక ఉగ్ర కుట్ర.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

March 18, 2022

fbfdbgd

కశ్మీరీ పండిట్లు 1990లో ఎదుర్కొన్న దారుణాలపై రూపొందిన చిత్రం కశ్మీర్ ఫైల్స్.. ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటోంది. బీహార్ మాజీ సీఎం, భాజాపా మిత్రపక్షం, హిందూస్థానీ ఆవామీ మోర్చా అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సినిమా వెనుక ఉగ్ర కుట్ర ఉందని, ఆ దిశగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చిత్రం పండిట్ల కష్టాలపై తీయలేదనీ, వారు తిరిగి కశ్మీర్‌కు వెళ్లాలంటే భయపడేలా చేసే కుట్ర ఇందులో ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, ఎన్డీఏలో భాగస్వామి అయిన మాంఝీ కొంతకాలం బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరోవైపు ఈ చిత్రంలో అవాస్తవాలను తెరకెక్కించారని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. లోయను విడిచిపెట్టిన వారిలో హిందువులతో పాటు, ముస్లింలు, సిక్కులు కూడా ఉన్నారని వెల్లడించారు. వారందరూ తిరిగి కశ్మీర్‌లో స్థిరపడేందుకు మా పార్టీ చేతనైనంత కృషి చేస్తోందని వివరించారు. ఇదిలా ఉండగా, చిత్ర దర్శకుడు అగ్నిహోత్రికి కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించింది. ఆయన దేశంలో ఎక్కడికెళ్లినా సీఆర్పీఎఫ్ దళాలు భద్రత కల్పిస్తాయని హోం శాఖ వర్గాలు తెలిపాయి.