నిజామాబాద్‌లో టమాటాను పోలిన పండ్లు.. రూ.100కు నాలుగు - MicTv.in - Telugu News
mictv telugu

నిజామాబాద్‌లో టమాటాను పోలిన పండ్లు.. రూ.100కు నాలుగు

October 18, 2019

చూడటానికి అచ్చం టమాటాను పోలి ఉన్నాయి కదా. మార్కెట్లో తోపుడుబళ్లపై వీటిని చూసిన వాళ్లంతా కూడా నిజంగానే టమాటాలు అని అనుకుంటున్నారు. కానీ ఇవి తియ్యటి రుచితో ఉన్న ఓమర్ పండ్లు. వీటికి మంచి గిరాకీ ఉండటంతో పాటు ధర కూడా భారీగానే ఉంది. ఆపిల్ ధరతో సమానంగా వీటి రేటు ఉంది. కేవలం నాలుగు పండ్ల ధర రూ. 100 పలుకుతోంది. 

Tomatoes

కశ్మీర్ నుంచి నిజామాబాద్‌లోని ఖలీల్‌వాడీ మార్కెట్లోకి ఇటీవల ఈ పండ్లు వచ్చాయి. వీటిని చూసిన వారంతా నిజంగానే టమాటాలు అనుకున్నారు. కానీ అవి ఎంతో తియ్యగా ఉండే ఓమర్ ఫ్రూట్ అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోయారు. చాలా మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఓసారి రుచి చూద్దామని వీటిని కొంటున్నారు. దీంతో ఈ వెరైటీ ఫ్రూట్‌ అమ్మకాలూ జోరుగానే సాగుతున్నాయి. 

కాగా ఈ పంట సాగును లెబనాన్‌కు చెందిన ఓమర్ అనే విద్యార్థి పరిచయం చేసినట్టుగా తెలుస్తోంది. 1956లో దాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. మొదట్లో వాటికి ఏ పేరు లేదు. దీన్ని పరిచయం చేసినందుకే అందుకే అతని పేరు మీదుగానే వీటికి ఆ పేరు వచ్చింది. ఇటీవల నిజామాబాద్‌కు చెందిన ఖలీల్‌వాడీ మార్కెట్ వ్యాపారులు వీటిని కశ్మీర్‌ నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి ప్రజలకు పరిచయం చేశారు.  మొత్తానికి ఈ కొత్త ఫ్రూట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.