ఈమె ముందు దేవసేన బలాదూర్ (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

ఈమె ముందు దేవసేన బలాదూర్ (వీడియో) 

September 21, 2020

OMG Incredible Chinese acrobatic girl

బాణాన్ని గురిచూసి కరెక్టుగా కొట్టాలంటే ఎంతో సాధన చెయ్యాల్సి వస్తుంది. అలాంటి బాణాన్ని కాలితో ఎక్కుపెట్టడం మాటలు కాదు. అందునా జిమ్మాస్టిక్ చేస్తూ కాళ్లను వెనకవైపు నుంచి పైకెత్తి గురి తప్పకుండా బాణాన్ని సంధించడం అంటే ఇంకా మామూలు విషయం కాదు. జిమ్నాస్టిక్ విన్యాసాలకు పెట్టింది పేరుగా నిలిచిన చైనాలో ఓ యువతి ఈ విన్యాసం చేసి అబ్బుర పరిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో వు తియాంజెన్ అనే అమ్మాయి ఆక్రోబాటిక్ విన్యాసాలు చేసింది. ఆమె కళాత్మక నైపుణ్యం చూసి ఆమె శరీరంలో స్ప్రింగులు ఏమైనా ఉన్నాయా, అసలు ఎముకలే లేనా అవి అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రెండు చేతులతోనే బాణం వదిలితే గురి తప్పుతుంది.. అలాంటిది ఆమె కాళ్లు పైకెత్తి బాణం వదిలితే అస్సలు గురితప్పలేదని కామెంట్లు చేస్తున్నారు. ఉత్తర చైనాలోని షాండోంగ్ ప్రావిన్స్‌కు చెందిన వు తియాంజెన్ అత్యంత క్లిష్టమైన ఆక్రోబాటిక్ విన్యాసాలను సైతం అలవోకగా చేస్తూ ప్రాచుర్యం పొందింది. గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడం వు తియాంజన్ కు మాత్రమే సాధ్యమంటే అతిశయోక్తి కాదు. మరోవైపు సైకిల్ పైనా ఆమె చేసే విన్యాసాలు అందరినీ ఔరా అనిపిస్తున్నాయి. కాగా, ఒలింపిక్స్ నుంచి ప్రపంచ జిమ్నాస్టిక్ చాంపియన్ షిప్ వరకు రష్యా ఆధిపత్యంగా సాగింది. దానిని సవాల్ చేసి, జిమ్మాస్టిక్‌లో పైచేయి సాధించడం చైనాకే చెల్లింది.