హైదరాబాద్‌లో వెలుగు చూసిన ‘ఒమిక్రాన్ బీఏ.4’.. ఇదే తొలి కేసు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో వెలుగు చూసిన ‘ఒమిక్రాన్ బీఏ.4’.. ఇదే తొలి కేసు

May 20, 2022

దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాలపాటు ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, మానసికంగా భయాందోళనకు గురిచేసిన కరోనా మహమ్మారి గతకొన్ని రోజలుగా మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు, పలు రాష్ట్రాలు కరోనా పట్ల స్వల్ప ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో తెలంగాణలో కరోనా కేసులు తక్కువగానే నమోదు అవుతున్నప్పటికి ముందు జాగత్త్రగా మాస్కులు తప్పనిసరి చేస్తూ, ప్రభుత్వం నిబంధన విధించింది.

తాజాగా హైదరాబాద్‌లో కొవిడ్ ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ‘బీఎ.4’నమోదు అయిందని అధికారులు తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఈ కేసు వెలుగులోకి వచ్చిందని, ఈ వేరియంట్‌ కేసు నమోదు కావడం దేశంలోనే ఇది తొలిసారి అని పేర్కొన్నారు. ఇది మరిన్ని నగరాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధికారులు తెలిపారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ మారియా వాన్ కెరోవ్ మాట్లాడుతూ ”దక్షిణాఫ్రికాలో కొవిడ్ ఉదృతికి కారణమైన రెండు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లలో ‘బీఏ. 4’ ఒకటి. అంతకుముందు కొవిడ్‌కు గురై, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇది సోకుతుంది. ఒమికాన్ వేరియంట్ కంటే ఇది ప్రమాదకారి కాదు. కాకపోతే వీటి వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుంది. భారత్‌లో ఇప్పటికే ఒమిక్రాన్ ఒకసారి వ్యాపించడం, టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వల్ల బీఏ. 4 ప్రభావం స్వల్పంగానే ఉంది” అని ఆయన అన్నారు.