హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం - MicTv.in - Telugu News
mictv telugu

హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం

December 22, 2021

07

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ ఎంత కలవరం రేపుతుందో అందరికి తెలిసిందే. ఈ వైరస్ ప్రభావంతో పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధిస్తుంటే, మరికొన్ని దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఈ తరుణంలో భారతదేశంలో కూడా పలు రాష్ట్రాలలో కేసులు నమోదు అవుతున్నాయి.

అయితే, బుధవారం హయత్‌నగర్ డివిజన్‌లో మ‌రో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు న‌మోదైంది. 23 ఏండ్ల యువ‌కుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. దీంతో తెలంగాణ‌లో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 25కు చేరింది. పాజిటివ్ బారినపడిన యువ‌కుడు ఇటీవ‌లే సూడాన్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చాడన్నారు. యువ‌కుడిని అధికారులు గ‌చ్చిబౌలి టిమ్స్‌కు త‌ర‌లించారు. యువ‌కుడి కాంటాక్ట్‌ల‌ను గుర్తించి, శాంపిళ్ల‌ను ఆరోగ్య శాఖ అధికారులు సేక‌రిస్తున్నారు.