చీమ సైజు కెమెరా.. గిన్నీస్ రికార్డుల్లోకి.. - MicTv.in - Telugu News
mictv telugu

చీమ సైజు కెమెరా.. గిన్నీస్ రికార్డుల్లోకి..

October 30, 2019

ఎవరిపైనా అయినా నిఘా ఉంచాలనుకుంటే ఇప్పటి వరకు పెన్ కెమెరా, బటన్‌లో పెట్టుకునే కెమెరాలు చూసి ఉంటాం. కానీ వాటన్నింటి కంటే అతి సూక్ష్మమైన కెమెరా మార్కెట్లోకి వచ్చింది. చీమ సైజులో ఈ కెమెరాను తయారు చేశారు. వెలిపై పెట్టుకొని దగ్గరగా చూస్తే తప్ప అది కెమెరా అన్న విషయం కూడా అర్థం కాదు. ఇప్పుడు ఈ అరుదైన మైక్రో కెమెరా ప్రపంచ రికార్డును కైవలం చేసుకొని గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. 

Small Camera..

హై ఎండ్ ఫెసిలిటీస్‌తో ఈ కెమెరాను ఓమ్నీ విజన్ తయారు చేసింది. ప్రపంచంలోనే ఇది అతి చిన్న, అత్యాధునిక కెమెరాగా రికార్డు సాధించింది. కేవలం 0.65 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే దీని సైజు ఉంటుంది. ఓవీఎం 6948 ను పేరుతో దీన్నీమార్కెట్లోకి తీసుకువచ్చారు. దీన్ని ప్రత్యేకించి  వైద్య రంగంలో ఉపయోగించేందుకు తయారు చేశారు. మనిషి శరీరంలోపల అవయవాల కదలికలు, ఆపరేషన్ సమయంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. 120 డిగ్రీల వైడ్ యాంగిల్ వ్యూ, 200/200 పిక్సెల్స్ రెజల్యూషన్, వెలుతురు తక్కువగా ఉన్నా స్పష్టంగా ఫొటోలు తీయనుంది. ఇప్పటి వరకు ఇంత చిన్న సైజు కెమెరా లేకపోవడంతో గిన్నీస్ రికార్డు సాధించినట్టు ఓమ్నీ విజన్ వెల్లడించింది.