గాడ్సేతో హిందూ పదం వాడారెందుకు? వివేక్ ఒబెరాయ్ - MicTv.in - Telugu News
mictv telugu

గాడ్సేతో హిందూ పదం వాడారెందుకు? వివేక్ ఒబెరాయ్

May 13, 2019

మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హసన్‌ హిందువులపై చేసిన తీవ్రవ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది హిందువు నాథూరాం గాడ్సే అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ కమల్ వ్యాఖ్యలను ఖండించాడు.

‘కమల్ సర్ మీరు చాలా గొప్ప నటులు. కళలకు మతంతో సంబంధం లేనట్లుగానే..ఉగ్రవాదానికి కూడా మతంతో సంబంధం లేదు. గాడ్సే ఓ ఉగ్రవాది అని చెప్పారు బాగానే వుంది. కానీ హిందూ అనే పదం ప్రత్యేకంగా ఎందుకు వాడారు? ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం.. వారి ఓట్ల కోసమేగా?’ అంటూ వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేశాడు. ఇదిలావుండగా కమల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఒక్కక్కరుగా ఖండిస్తున్నారు. ఆయన ఐదు రోజుల పాటు ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ్ ఈసీని కోరారు.