కరోనా పుణ్యం.. 'రామాయణం' మళ్ళీ ప్రసారం - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా పుణ్యం.. ‘రామాయణం’ మళ్ళీ ప్రసారం

March 27, 2020

On Public Demand, Ramayan serial Will Air On Doordarshan Againv

కరోనా మహమ్మారిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అధికశాతం ప్రజలు వినోదం కోసం టీవీ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందువులు ఎంతో ఆసక్తిగా వీక్షించే రామాయణం సీరియల్‌ను మరోసారి టీవీల్లో ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

‘ప్రజల డిమాండ్‌ మేరకు రామాయణాన్ని మరోసారి టీవీల్లో ప్రచారం చేస్తున్నాం. మార్చి 28 నుంచి ఈ సీరియల్‌ ప్రారంభం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్‌ చానల్‌లో ‍ప్రసారం కానుంది’ అని ఈ మేరకు కేంద్ర ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ ట్వీట్ చేశారు. కాగా, తొలిసారి రామ‌య‌ణం సీరియ‌ల్‌ 1987 నుంచి 1988 మ‌ధ్య కాలంలో దూర‌ద‌ర్శన్‌లో ప్రసరమైనది.