On September 23 get movie tickets for Rs. 75
mictv telugu

గమనిక : రూ. 75 కే సినిమా టిక్కెట్.. తేదీ మారింది

September 13, 2022

కరోనా, ఓటీటీల ప్రభావంతో దూరమైన ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించాలని మల్టీప్లెక్స్‌ థియేటర్ వారు భావిస్తున్నారు. ఆదాయం పూర్తిగా పడిపోవడంతో కొన్ని ప్రత్యేక ఆఫర్లను ప్రేక్షకులకు అందించడానికి ముందుకు వచ్చారు. అందులో ఒకటి స్నాక్స్ ధరలు తగ్గించడం అయితే మరొకటి తక్కువ ధరకే సినిమా టిక్కెట్లను అందించడం. మొదటి కొంత అమలు చేయగా, రెండోది మాత్రం సెప్టెంబర్ 16న జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ఒక్కరోజుకు రూ. 75కే టిక్కెట్ అందించాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఆ రోజు సుమారు 4 వేల థియేటర్లలో రూ. 75కే టిక్కెట్ అందించాలని భావించారు. ఇప్పుడు ఆ తేదీలో ఓ మార్పు చేసింది. దానిని సెప్టెంబర్ 23కి వాయిదా వేస్తున్నట్టు అసోసియేషన్ తెలిపింది. మరిన్ని థియేటర్లు ఈ విషయంలో పాలుపంచుకోవాలనే ఉద్దేశంతో మార్పు చేసినట్టు కారణాన్ని వెల్లడించింది. కాగా, పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, కార్నివాల్, డిలైట్ వంటి మల్టీప్లెక్సుల యాజమాన్యాలు జాతీయ సినిమా దినోత్సవం నాడు రూ. 75కే సినిమాతో సంబంధం లేకుండా టిక్కెట్లను అందించనున్నాయి.