కలెక్టర్‌‌ను పల్లకిలో మోసిన గ్రామస్థులు - MicTv.in - Telugu News
mictv telugu

కలెక్టర్‌‌ను పల్లకిలో మోసిన గ్రామస్థులు

August 30, 2019

On Siaha District........

కొనేళ్ల క్రితం ఏదైనా గ్రామంలో ఎవరైనా పెద్ద చదువులు చదివి పాసైనా… ప్రభుత్వంలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నా వారి స్వగ్రామంలో ఉరేగించేవారు. కానీ, క్రమంగా చదుకున్నవారు ఎక్కువ కావడంతో ఆ పద్దతి మరుగునపడింది. కాని, ఇప్పటికి ఉన్నత చదువులు చదివినవారికి, ఉన్నత ఉద్యోగాలు తెచుకున్నవారికి సన్మానాలు గట్రా చేస్తుంటారు. అయితే ఇలాంటి సంఘటనే మిజోరాం రాష్ట్రంలో ఓ జిల్లా కలెక్టర్‌కు ఎదురైంది. మొదటిసారి తమ గ్రామానికి వచ్చిన కలెక్టర్‌ను గ్రామస్థులు పల్లకిలో మోసుకెళ్లారు. 

On Siaha District........

వివరాల్లోకి వెళితే..రాష్ట్రంలోని సియహా జిల్లాలో తిసోపి అనే మారుమూల గ్రామం ఉంది. 400 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో కనీస సౌకర్యాలు, రోడ్డు సదుపాయం కూడా లేవు. ఇటీవలే ప్రభుత్వం అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన ద్వారా రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు సియహా జిల్లా కలెక్టర్‌ భూపేశ్ చౌదరి తిసోపి గ్రామానికి వెళ్లారు. ఓ మోస్తరు వర్షం కురుస్తున్నా కూడా లెక్కచేయకుండా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. ఇన్నేళ్లలో ఆ గ్రామానికి ఒక్క కలెక్టర్ కూడా రాలేదట. దీంతో భూపేశ్ చౌదరి వస్తున్నారని తెలియగానే గ్రామస్థులు ఎంతో సంతోషించారు. కలెక్టర్‌ గ్రామా సరిహద్దుల్లోకి రాగానే ఆయనను పల్లకిలో ఎక్కించుకుని గ్రామంలోకి మోసుకెళ్లారు. భూపేశ్ వద్దని చెప్పినా వారు వినిపించుకోలేదు. ఈ సందర్భంగా భూపేశ్‌ మాట్లాడుతూ..‘నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నన్ను చూడగానే వారు ఎంతో ఆనందించారు. ఇప్పటివరకు ఏ కలెక్టర్‌ అక్కడకు వెళ్లలేదు. వారు నన్ను ఆదరించిన తీరు ఆనందంగా ఉంది’ అన్నారు. గ్రామాల్లోకి వెళ్తేనే వారి సమస్యలు అర్థమవుతాయని, అందుకే తాను తిసోపి వచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ ను పల్లకిలో మోసుకెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షం సైతం లెక్కచేయకుండా ఆ గ్రామానికి వెళ్లిన కలెక్టర్ పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.