పూలపండుగలో నాలుగో రోజు… నేడు నానేబియ్యం బతుకమ్మ… - MicTv.in - Telugu News
mictv telugu

పూలపండుగలో నాలుగో రోజు… నేడు నానేబియ్యం బతుకమ్మ…

October 12, 2018

పూలవనం అయింది తెలంగాణ. ఆడపడుచుల ఆనందాలు మిన్నంటాయి. పుట్టిళ్ళన్ని ఆడబిడ్డల రాకతో కళకళలాడుతున్నాయి. ఆడబిడ్డ పుట్టింటికి తెచ్చిన పూల పండుగ బతుకమ్మ. ఊరూవాడా పూలబతుకమ్మలు పేర్చడానికి ప్రతిరోజూ శివార్లకు పోతున్నారు. వెదురు బుట్టల్లో గునుగు, తంగేడు పూలు తెచ్చి పూల పర్వతాలుగా బతుకమ్మలను పేరుస్తున్నారు. ముద్దొచ్చే చిన్నారులు బొడ్డెమ్మలై ఆటపాటలతో అలరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ పండుగ లక్ష్మీ కళను తీసుకువచ్చిందనే చెప్పాలి.On the fourth day of flowers festival... today is rice bathukamma9రోజుల సంబురం ఇది. ఈ సంబురాల్లో భాగంగా మూడు రోజులు ముచ్చటగా గడిచిపోయాయి. ఈరోజు నాలుగవ రోజు. నిన్న ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. నేడు ‘నానే బియ్యం బతుకమ్మ’ ఉత్సవం. ఇవాళ కూడా అన్నలు, అక్కలు సైకిళ్ళ మీద శివారు మీదకు వెళ్లి పువ్వులను కోసుకురావడానిక సిద్ధమయ్యారు. మరి ఈరోజు బతుకమ్మ ప్రసాదం ఏముంటుందంటే..  నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. సాయంత్రం అందరూ బతుకమ్మలను ఒకచోట చేర్చి ఆడిపాడి నిమజ్జనం చేసి, ప్రసాదం ఆరగించడంతో నానేబియ్యం బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.