ఆజా దేవా ఆజా.. నీకు 9 రోజుల పూజ.. మంగ్లీ పాట మీకోసం..   - MicTv.in - Telugu News
mictv telugu

ఆజా దేవా ఆజా.. నీకు 9 రోజుల పూజ.. మంగ్లీ పాట మీకోసం..  

August 30, 2019

తొమ్మిది రోజులు నిత్య పూజలు.. భజనలు.. డీజేలు.. ఫలహారాలు.. లడ్డూ.. అగరబత్తీల సువాసనలు.. అనంతరం నిమజ్జనం.. ఊరేగింపులు.. వినాయక చవితి సందర్భంగా ఏ గల్లీ చూసినా మనిషి మనిషిలో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. రంగురంగుల విగ్రహాలతో గల్లీ గల్లీ, ఇల్లిల్లూ భక్తి పారవశ్యంతో పులకిస్తాయి. ఈ పండగ అంటే మనకు ఎంతో స్పెషల్. ఈ స్పెషల్ డేస్‌కు మరింత వన్నె తెచ్చేది పాట. ఈ పాటల పరంపరలో ఈసారి వినాయక చవితి సందర్భంగా మీ అభిమాన గాయని మంగ్లీ మరో మధురమైన పాటతో మీ ముందుకు వచ్చింది. ‘ఆ ఆజా దేవా ఆజా.. నీకు తొమ్మిది రోజుల పూజ’ అంటూ మిమ్మల్ని అలరించడానికి వచ్చింది. కాసర్ల శ్యాం సాహిత్యం అందించగా, బాజీ సంగీతం అందించారు. 

మంగ్లీ అఫీషియల్ ఛానల్‌లో ఈ పాట విడుదల అయింది. పటాస్ బల్‌వీర్ సింగ్, డి పవన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ వినాయక చవితి సందర్భంగా ఈ పాటను వీక్షించి మీ ఆదరాభిమానాలు ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.