On the prices of cancer drugs..Kendram Goodnews
mictv telugu

క్యాన్సర్ మందుల ధరలపై..కేంద్రం గుడ్‌న్యూస్

September 14, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న క్యాన్సర్ బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్తను చెప్పింది. అతి త్వరలోనే క్యాన్సర్ మందుల ధరలను తగ్గిస్తున్నామని పేర్కొంది. అందులో 384 మందులను చేర్చినట్లు తెలియజేసింది. మంగళవారం క్యాన్సర్ మందుల ధరలకు సంబంధించి, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ నిత్యావసర ఔషధాల జాబితా-2022ను విడుదల చేశారు.

మనసుఖ్ మాండవీయ మీడియాతో మాట్లాడుతూ..”దేశంలో పలు రకాల క్యాన్సర్ మందులు, యాంటీబయోటిక్స్, టీకాల ధరలు అతి త్వరలోనే తగ్గనున్నాయి. 27 విభాగాలకు చెందిన 384 మందులకు స్థానం కల్పించాం. క్యాన్సర్ మందులు, యాంటీబయోటిక్స్, టీకాలతోపాటు, ఇతరత్రా ముఖ్యమైన ఔషధాల ధరలు అందుబాటులోకి రావడంతో, రోగులపై ఆర్థికభారం తగ్గుతుంది. ఈ జాబితాలో గుండె సంబంధ వ్యాధులు, ఎనస్థీషియా, నాడీ సంబంధ సమస్యలు, చెవి, ముక్కు గొంతు, జీర్ణాశయ వ్యవస్థ, హార్మోన్లు, ఎండోక్రైన్, గర్భనిరోధక మందులు ఉన్నాయి. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్, పారాసిటమాల్, రిబావిరిన్, (స్ట్రెప్టోమైసిన్, లోరాజెపం, ఐవరైమెక్టిన్ లకూ స్థానం కల్పించాం. మొత్తం 34 మందులను కొత్తగా నిత్యావసర ఔషధాల జాబితాలో చేర్చాం. 2015 నాటి జాబితా నుంచి 28 మందులను తొలగించాం” అని ఆయన అన్నారు.

ఇక, ధరలు తగ్గనున్నాయి వాటిలో..ముఖ్యంగా రానిటిడిన్, బ్లీచిం గొపౌడర్, ప్రోకార్బనైజ్, రిఫాబుటిన్, సుక్రాల్ ప్లేట్ ఉన్నాయి. 350 మంది నిపుణులను సంప్రదించి, 140 సమావేశాల అనంతరం దేశ ప్రజల ఆరోగ్య అవసరాలకు ప్రాధాన్యమిస్తూ ఈ జాబితాను ఖరారు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ జాబితాలో ఉన్న మందులన్నింటినీ పూర్తి నాణ్యతతో సహేతుక ధరల్లో వినియోగదారులకు అందుబా టులో ఉంచాలని, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అనుసరించి భారత్ నిత్యా వసర ఔషధాల జాబితాను ఖరారు చేసినట్లు అధికారులు తెలియజేశారు.