కోతులే వారికి అతిథులు.. కొసరి కొసరి వడ్డిస్తున్నారు.. - MicTv.in - Telugu News
mictv telugu

కోతులే వారికి అతిథులు.. కొసరి కొసరి వడ్డిస్తున్నారు..

September 12, 2019

monky...

అవును వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. కోతులను వారు అతిథులుగా భావించి పంచ భక్ష పరమాన్నాలు వడ్డిస్తున్నారు. విస్తరాకు వేసి అందులో రకరకాల వంటకాలు పెడుతున్నారు. ఇంటికి వచ్చిన విశిష్ట అతిథికి చేసినట్టుగా రాచ మర్యాదలు చేస్తున్నారు. గుమగుమలాడే వంటకాలను లాగించేస్తున్న వానరాలు తెగ సంబరపడిపోతున్నాయి. ఇదంతా ఎక్కడో జరగడంలేదు. పొరుగు రాష్ట్రమైన కేరళలో జరుగుతోంది. 

కొల్లాం జిల్లా సడ్తంకొట్టా గ్రామంలో ఈ వింత ఆచారం నడుస్తోంది. దశాబ్ధాలుగా ఇక్కడ వానరాలకు ప్రతి ఏటా ఓనం రోజు పంచభక్ష పరమాన్నాలు తయారు చేసి కడుపునిండా తిండి పెడతారు. అయితే ఇలా చేయడానికి ఓ చారిత్రక అంశం కూడా ముడిపడి ఉంది. ఓనం రోజు విష్ణుమూర్తి వామన అవతారాన్ని కొలుస్తారు. వామనుడి చేతిలో హతమైన మహా బలిచక్రవర్తి ఓనం రోజు వానరుల రూపంలో వస్తుందని అక్కడి ప్రజల నమ్మకం అందుకే వాటికి ఇలా భోజనం పెట్టడం ప్రారంభించారు. ఆ రోజు మహా బలిచక్రవర్తికి ఆహారంపెడితే శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇలా ప్రతి ఏటా వందలాది వానరులు ఇక్కడికి వచ్చి ఆహారం తింటాయని స్థానికులు చెబుతున్నారు. 

 

Onam Feast Served Food for Monkeys