ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సబ్బులు అమ్ముకుంటోంది - MicTv.in - Telugu News
mictv telugu

ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సబ్బులు అమ్ముకుంటోంది

June 17, 2022

ఒకప్పుడు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్‌గా పేరుగాంచింది. నేడు ఎలాంటి సినిమాల్లో ఛాన్స్‌లు లేక ఇంటింటికి వెళ్లి సబ్బులను అమ్ముతూ, జీవనం సాగిస్తుంది. ఎవరైనా, మంచి జీతం ఇస్తానంటే పాచిపని కూడా చేస్తానంటూ సిద్ధమైంది. ఆమె ఎవరు? ఏ సినిమా పరిశ్రమకు చెందినవారు? ఎన్ని సినిమాల్లో నటించారు? అనే వివరాల్లోకి వెళ్తే.. తమిళ సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్యా భాస్కరన్.. ఇంటింటికి తిరిగి సబ్బులు విక్రయిస్తుండటం హాట్ టాఫిక్‌గా మారింది.

‘న్యాయంగళల్ జయిక్కట్టుం’ సినిమాతో తమిళ తెరకు పరిచమైన ఐశ్వర్య దాదాపు 200 సినిమాల్లో నటించారు. మోహన్‌లాల్‌తో హిట్ సినిమాలైన బటర్‌ఫ్లైస్, నరసింహమ్, ప్రజా వంటి వాటిలో నటించారు. హీరోయిన్‌గా అవకాశాలు కరవైనా చిన్నచిన్న పాత్రలు వేసి మెప్పించారు. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. ఆ తర్వాత అవి కూడా లేకపోవడంతో కుటుంబ జీవనానికి సబ్బులు విక్రయిస్తున్నట్టు ఐశ్వర్య స్వయంగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా, 1994లో తన్వీర్ అహ్మద్‌ను పెళ్లి చేసుకున్న ఐశ్వర్య మూడేళ్ల తర్వాత విడాకులిచ్చి, తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటూ, రోజుకు ఒక పూట మాత్రమే ఆహారం తీసుకుంటున్నట్టు ఆమె చెప్పారు.

ఐశ్వర్యా భాస్కరన్ మాట్లాడుతూ..”సినిమా అవకాశాల లేక ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాను. నేను జీవనం కోసం సబ్బులు విక్రయిస్తున్నాను. ఎవరైన మంచి జీతం ఇస్తానంటే పాచిపని కూడా చేస్తాను. ప్రస్తుతం నేను చేస్తున్న పనితో సంతోషంగానే ఉన్నాను. అప్పులు, ఇతర సమస్యలు అన్నీ తీరిపోయి, సంతోషంగా ఉన్నా, నాకు నలుగురు పిల్లలు. యోగాను సాధన చేస్తుండడం వల్ల రోజుకు ఒక పూట మాత్రమే ఆహారం తీసుకుంటున్నా. సీరియల్సే నాకు బతుకునిచ్చాయి. సినిమాలు నాకు అన్నం పెట్టలేదు. ప్రస్తుత నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే నాకు ఒక మెగా టీవీ సీరియల్ కావాలి” అని ఆమె అన్నారు.