చైనాలో మరోసారి కరోనా విజృంభణ
చైనాలో మరోసారి కరోనా విజృంభిస్తుంది. భారీగా కేసులు పెరుగుతుండడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. రోజుకు10 వేల కేసులు నమోదు కావడంతో జీరో కోవిడ్ లక్ష్యంగా కఠని చర్యలు అవలంభిస్తున్నారు. తాజాగా ఆరు నెలల తరువాత తొలి కరోనా మరణం సంభవించడంతో అధికారుల అలెర్ట్ అయ్యారు. ప్రజలను క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. బీజింగ్‌లో సెమీ లాక్‌డౌన్‌ను విధించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మళ్లీ మూతపడ్డాయి. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని, రోజువారీ టెస్టింగ్‌లు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు రాకపోకలు కుదించుకోవాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని పలు జిల్లాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న మరణాలు పెద్దగా చోటు చేసుకోకపోవంతో కొంత ఊరటనిస్తోంది. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులే కోవిడ్ ఇబ్బందులకు గురవుతున్నట్లు చైనా ప్రకటించింది. చైనాలో దాదాపు 92 శాతం మంది కనీసం ఒక్కడోసు కరోనా టీకా తీసుకున్నారు. అయితే వృద్ధులకు మాత్రం టీకాలు సరిగా పంపిణీ చేయలేదనే ప్రచారం జరుగుతోంది.