Once again, the terrorists were provoked..one died
mictv telugu

మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..ఒకరు మృతి

August 16, 2022

కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లా చోటిపోరా ప్రాంతంలో కశ్మీర్‌ పండిట్లే లక్ష్యంగా ఉగ్రవాదులు మరోసారి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తూటా తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అప్రమత్తమైన పోలీసులు..ఘటన స్ధలానికి చేరుకొని, తూటాలు తగిలిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ కాల్పుల్లో గాయపడినవారు మైనారిటీ వర్గానికి చెందిన వారుగా కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.

”ఈరోజు షోపియాన్‌, చోటిపోరా ప్రాంతంలోని ఆపిల్‌ పంట్ల తోటలో స్థానికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువురు మైనారిటీ కమ్యూనిటికీ చెందినవారే. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాం. తదుపరి వివరాలను వెల్లడిస్తాం.’ అని ట్విటర్ వేదికగా కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.