విజయదేవర కొండ-రష్మికా మధ్య రిలేషన్ ఉందంటూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారని బయట చెవులు కొరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ జంట ప్రవర్తించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంలోనూ వీరిద్దరు చేసిన పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ విజయ్ దేవరకొండ ఓ ఫోటోను షేర్ చేశాడు. సముద్ర తీరంలో రిసార్ట్ దగ్గర స్విమ్మింగ్ ఫూల్లో ఉన్న ఫోటో పెట్టి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. విజయ్ పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే రష్మికా మందన్నా కూడా న్యూ ఇయర్ విషెష్ పోస్ట్ చేసింది. ఏదో రిసార్ట్‌లో పూల్ పక్కనే ఉన్న పిక్చర్‌ను అప్లోడ్ చేసింది. దీంతో మరోసారి గుసగుసలు మొదలయ్యాయి. ఇద్దరూ ఒకేచోట ఉన్నారని..న్యూ ఇయర్ సందర్భంగా రిస్టార్‌లో ఎంజాయ్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో మరోసారి విజయ్-రష్మికా జంట అడ్డంగా దొరికేసింది.
31 వ రాత్రి రష్మికా ఇన్ స్టా వేదికగా లైవ్ ఛాట్ నిర్వహించింది. అభిమానులతో 2022కి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. ఈ సమయంలో ఓ మేల్ వాయిస్ వినిపించింది. అది విజయ్ దేవరకొండదే అని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. మళ్లీ ఇలా అడ్డంగా దొరికిపోయారేంటీ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక, విజయ్ బంధంపై ట్రోల్స్ మళ్ళీ మొదలయ్యాయి. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించారు.