అనగనగా ఒక వైరస్..అమెరికాను వెక్కిరిస్తూ చైనా వీడియో
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో మొదటి పుట్టిన బ్రేక్ అవుట్ అయిన సంగతి తెల్సిందే. దీంతో కరోనా వైరస్ వల్ల భారీగా నష్టపోయిన దేశాల్లో ఒకటైన అమెరికా.. చైనాపై విమర్శలు చేస్తూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకు ఒకసారైనా చైనాను విమర్శిస్తున్నాడు. ఒకానొక సమయంలో డబ్ల్యుహచ్ఓకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లోని చైనా ఎంబసీ.."వన్స్ అపాన్ ఏ వైరస్" అనే క్యాప్షన్‌తో అమెరికాను విమర్శిస్తూ ఓ యానిమేటెడ్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో.."డిసెంబర్ లో వింతైన న్యూమోనియా కేసులు నమోదయ్యాయని చైనా డబ్ల్యూహెచ్‌ఓకు తెలిపింది. జనవరిలో కొత్త వైరస్ పుట్టిందని చెబితే అమెరికా దానిని కొట్టిపారేసింది. అది ప్రమాదకరమైనదని చెబితే అమెరికా అది సాధారణ ఫ్లూ అంది. మాస్క్ ధరించాలంటే అమెరికా వద్దని చెప్పింది. ఇంట్లోనే ఉండాలంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘనని అమెరికా అంది. చైనా తాత్కాలిక ఆస్పత్రులు నిర్మిస్తే కాన్సంట్రేషన్ క్యాంపులను నిర్మిస్తుందని అంది. పది రోజుల్లో తాత్కాలిక ఆసుపత్రి నిర్మిస్తే షో ఆఫ్ అంది. ఏప్రిల్ నాటికి చైనా అబద్ధాలు చెబుతోందని నిందించింది." అంటూ యానిమేటెడ్ దృశ్యాలను ప్రదర్శించింది. ఈ వీడియో నేపథ్యంలో నెటిజన్లు చైనాను విమర్శిస్తున్నారు.