అయోధ్య ట్రస్ట్‌లో దళితులకు చోటు - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య ట్రస్ట్‌లో దళితులకు చోటు

February 5, 2020

bhnhvb

చాలా కాలంగా పరిష్కారం లేకుండా ఉంటూ వచ్చిన అయోధ్య రామ మందిర వివాదం ముగిసింది. మెల్లమెల్లగా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సమయంలోనే మందిరం నిర్మాణం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ట్రస్ట్‌లో ఎవరెవరు ఉంటారనే అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. దళితులకు కూడా ట్రస్ట్‌లో చోటు కల్పిస్తున్నట్టు చెప్పారు. 

మొత్తం 15 మందితో ఈ ట్రస్ట్ ఉంటుందని తెలిపారు. దీంట్లో దళిత వర్గం నుంచి ఒకరికి ఎప్పటికీ ప్రాతినిథ్యం ఉంటుందన్నారు. సామాజిక సామరస్యాన్ని కాపాడుతూ ఈ అవకాశం కల్పించామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ట్రస్టు సభ్యులే తీసుకునేస్వేచ్ఛ ఉంటుందన్నారు. ఏ నిర్ణయంలోనైనా వీరే కీలకంగా ఉంటారని తెలిపారు.