ఒకే కుక్క ముద్దు..రెండోది వద్దు..దాటితే... - Telugu News - Mic tv
mictv telugu

ఒకే కుక్క ముద్దు..రెండోది వద్దు..దాటితే…

June 10, 2017

ఇంటికి ఒకటే కుక్కను పెంచుకోవాలి. దాని పిల్లా జెల్లా అంటే కుదరదు. రూల్స్ బ్రేక్ చేస్తే జరిమానా తప్పదు.. అది మామూలుగా కాదు వేలలో..కుక్కలేంటీ.రూల్స్ ఎంది అంటారా..ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా..?
అప్పట్లో ఒకరు ముద్దు..ఇద్దరు వద్దు… స్లోగన్ తెగ ఫేమస్. జనాభా విషయంలో జనానికి బాగా ఎక్కింది.ఇది మోగింది చైనాలో అయినా…భారత్ లో భలే దరువేసింది. ఇప్పుడు చైనా వాళ్లు వన్ డాగ్ పాలసీ తెచ్చారు. ప్రతి ఇంట్లో ఒక్కటే కుక్క ఉండాలి..లేదంటే లేదు. ఒక కుక్కకు మించి ఉంటే ఫైన్ తప్పదు. ఒకటి దాటితే 300 డాలర్లు ఫైన్ క‌ట్టాల్సిందే.
ఈస్ట్ చైనాలోని క్వింగ్డావో సిటీలో ఈ కొత్త పాలసీని ప్ర‌వేశ‌పెట్టారు. అంతే కాదు.. 40 ర‌కాల కు చెందిన కొన్ని బ్రీడ్ల కుక్క‌ల‌ను కూడా త‌మ ఇళ్లల్లో పెంచుకోవ‌ద్ద‌ని రూల్ పెట్టారు. వాటిలో జెర్మ‌న్ షెఫ‌ర్డ్, టిబెట‌న్ మ‌స్టిఫ్స్, పిట్ బుల్స్ లాంటి బ్రీడ్స్ లిస్ట్ లో ఉన్నాయి.
చైనాలో మనుషుల కన్నా కుక్కల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. వీటి వ‌ల్ల జ‌రిగే ప్ర‌మాదాలు పెరిగిపోతున్నాయి. అందుకే.. కుక్క‌ల వ‌ల్ల జ‌రిగే ప్ర‌మాదాల‌ను అరిక‌ట్ట‌డానికే ఈ పాల‌సీ ని ప్ర‌వేశ పెట్టారు. పాల‌సీ అమలులోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇంట్లో కుక్క‌ను పెంచుకోవాలంటే..ముందుగా రిజిస్ట‌ర్ చేసుకొని 60 డాల‌ర్లు చెల్లిస్తే అప్పుడు కుక్క‌ను పెంచుకోవ‌డానికి అనుమ‌తి ఇస్తారు. చూడాలి వన్ డాగ్ పాలసీ చైనాలో ఎంత హిట్టవుతుందో..భారత్ పై ఎంత ఎఫెక్ట్ ఉంటుందో…