ఒంటి కన్ను తెల్లచేప.. చూసి ఆశ్చర్యపోతున్న జనం  - MicTv.in - Telugu News
mictv telugu

ఒంటి కన్ను తెల్లచేప.. చూసి ఆశ్చర్యపోతున్న జనం 

October 21, 2020

One Eye Baby Shark

భూమిపై ఎన్నో వింతలు, విడ్డూరాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రెండు తలల జీవులు, ఒంటి కన్ను ఇలా అనేకం కనిపిస్తాయి. ఇటీవల హిందూ మహాసముద్రంలో రెండు తలల చేపను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఇది గడిచిన కొన్ని రోజులకే మరో వింత చోటు చేసుకుంది. ఇండొనేసియా సముద్రంలో ఒంటి కన్ను తెల్ల చేప బయటపడింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.   

అక్టోబర్ 10వ తేదీన మాలుకూలో కొంత మంది జాలర్లు వేటకు వెళ్లగా వారి వలకు ఓ షార్క్ చేప చిక్కింది. అది చనిపోవడంతో దాని పొట్టను కోసి చూడగా అందులో ఓ చిన్నపాటి సైజులో చేప కనిపించింది. పరీక్షించి చూడగా.. పెద్ద సైజులో ఒంటి కన్ను మాత్రమే ఉంది. చూస్తేనే వణుకు పుట్టేలా దాని రూపం కనిపించడంతో వైరల్‌గా మారింది. అది షార్క్‌లోని సైక్లోప్స్ రకానికి చెందినదిగా నిపుణులు చెబుతున్నారు. గ్రీకు పురాణాల్లో ‘సైక్లోప్స్’ చేప గురించి ప్రస్తావన ఉండేదని అంటున్నారు. 2011లో కూడా అమెరికా జాలర్లకు ఇలాంటి చేప ఒకటి చిక్కిందని వెల్లడించారు. అయితే సైక్లోపియా సమస్య వల్ల కూడా చేపల్లో ఈ లోపాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. కాగా, 2020 సంవత్సరం ఆరంభం నుంచే అన్ని వింతలు విడ్డూరాలు చోటు చేసుకుంటున్నాయి.ఇవన్నీ యుగాంతానికి సాంకేతమని పలువురు అభిప్రాయపడుతున్నారు.