ఒంటి కన్ను కుక్కపిల్ల.. పోటెత్తిన జనం, అదృష్టమని..  - MicTv.in - Telugu News
mictv telugu

ఒంటి కన్ను కుక్కపిల్ల.. పోటెత్తిన జనం, అదృష్టమని.. 

February 4, 2020

One eyed puppy.

ఓ కుక్కకు రెండు పిల్లలు పుట్టాయి. ఒకటి చక్కగానే ఉంది. మరొకటి మాత్రం వింతగా ఉంది. నుదుటిపై కేవలం ఒకే కన్నుతో జనాన్ని కట్టిపడేస్తోంది. దాని తలపై కొమ్ములాగా చిన్న బుడిపె కూడా ఉండడం మరో విశేషం. అది పుట్టిన ఇంటికి అదృష్టం పడుతుందని కొందరు, ఆ పిల్ల బతికితే అద్భుతాలు జరుతాయని కొందరు నానా మాటలూ అంటున్నారు. థాయ్‌లాండ్‌లోని చాకోయెంగ్‌సావోలో అదివారం ఆ పసికూన పుట్టింది. 

అది ‘మినియాన్స్’ అనే కార్టూన్ పిక్చర్ లోని పప్పీలాగా ఉండడంతో దానికి ‘మినియాన్స్‌ కెవిన్‌’ అని నామకరం చేశారు. ఒక కన్ను లేకపోయినా కెవిన్ పూర్తి ఆరోగ్యంతో ఉందని యజమాని ఫుమ్మామాన్ చెబుతున్నారు. ఒక కన్నే ఉండడంతో కెవిన్ తల్లి పాలు తాగడానికి ఇబ్బంది పడుతోంది. దీంతో యజమానే సీసాతో పాలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల జనం దాన్ని చూడ్డానికి తండోపతండాలుగా వచ్చేస్తున్నారు.