1 జీబీ ధర రూ.35 చేయాలి.. సర్కారుకు వొడాఫోన్ వినతి - MicTv.in - Telugu News
mictv telugu

1 జీబీ ధర రూ.35 చేయాలి.. సర్కారుకు వొడాఫోన్ వినతి

February 28, 2020

One gb data.

ఇలాంటి విచిత్రాలు మన దేశంలోనే జరుగుతాయి. ఎక్కడెక్కడో ఎవరెవరో సొమ్ము దోచుకుంటారు. ప్రభుత్వాలు మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటాయి. చివరకు ఏ పాపమూ ఎరగని జనం జేబులుకు చిల్లు పెడతారు. వేల మంది పనిచేసే ప్రభుత్వ సంస్థలను మూసేస్తారు. ఎయిర్ ఇండియా, బీఎస్ఎన్ఎల్.. తాజా ఉదాహరణలు మాత్రమే. తాజా ప్రభుత్వానికి వేల కోట్లు బకాయి పడ్డ వొడాఫోన్ ఐడియా కొత్తా పాట ఎత్తుకుంది. ఒక జీబీ ఇంటర్నెట్ డేటా ఖరీదును రూ. 35గా ప్రకటించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంది. ప్రస్తుతం దీని ధర రూ. 4 నుంచి 5 మధ్య ఉంది. 

వొడాఫోన్ ప్రభుత్వానికి రూ. 53 వేల కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది. అంత కట్టాలంటే ఒక జీబీ డేటా ధరను రూ. 35గా, ఒక కాల్ ధరను 6 పైసలుగా ప్రకటించి, ఏప్రిల్ 1 నుంచ అమల్లోకి తేవాలని ఆ కంపెనీ టెలికమ్యూనికేషన్ల శాఖకు లేఖ రాసింది. కనిష్ట మొబైల్ చార్జీని కూడా 50కి పెంచాలని లెక్కలు గట్టింది.  బకాయిలను చెల్లించేందుకు 18 ఏళ్ల గడువు కావాలి, మూడేళ్లువడ్డీ, జరిమానా నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా వేడుకుంది. వొడాఫోన్ మూడు నెలల కిందటే తన ప్యాకేజీ ధరలను 50 శాతం పెంచింది. లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం వాడకం చార్జీల కింది టెలికం కంపెనీ ప్రభుత్వానికి లక్ష కోట్లకుపైగా బకాయిలు(ఏజీఆర్) పడిన సంగతి తెలిసిందే. వాటిని ఎగ్గొట్టడానికి కంపెనీలు అన్ని దారులూ వెతుకుతున్నాయి.