పిల్లి వల్ల వంద కోట్ల నష్టం - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లి వల్ల వంద కోట్ల నష్టం

March 24, 2022

cat

ఓ పిల్లి చేసిన పనికి విద్యుత్ శాఖకు, వ్యాపారులకు దాదాపు వంద కోట్ల నష్టం వాటిల్లింది. మహారాష్ట్రలోని పింప్రీ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ప్రాంతంలో ఉన్న ఓ విద్యుత్ సబ్‌స్టేషనులోని ఓ ట్రాన్సుఫార్మర్‌పై పిల్లి ఎక్కింది. దాంతో షార్ట్ సర్క్యూట్ అయి 60 వేల విద్యుత్ వైర్లు తెగిపోయాయి. చుట్టుపక్కల 60 వేల కనెక్షన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పక్కనే ఉన్న పారిశ్రామిక ప్రాంతం భోసారిలో ఏడు వేల కనెక్షన్లకు కరెంటు నిలిచిపోవడంతో దాదాపు వంద కోట్ల నష్టం వాటిల్లిందని అక్కడి పరిశ్రమల సంఘం అధ్యక్షుడు వెల్లడించారు. తెగిపోయిన వైర్లను పునరుద్ధరించి వెంటనే విద్యుత్ సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే మూడు రోజుల వరకు కరెంట్ వచ్చే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యుత్ పొదుపుగా వాడాలని, లేదంటే భారమంతా ప్రస్తుతం వినియోగంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లపై పడుతుందని ఆ శాఖ అధికారులు స్థానికులను హెచ్చరిస్తున్నారు.