హైదరాబాదులో బోర్డు తిప్పేసిన ఐటీ సంస్థ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాదులో బోర్డు తిప్పేసిన ఐటీ సంస్థ

May 30, 2022

నగరంలో మరో ఐటీ సంస్థ బోర్డు తిప్పేసింది. 800 మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా రూ. 20 కోట్లు వసూలు చేసి రెండు నెలలు శిక్షణ ఇచ్చి జీతాలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో రెండు వారాల క్రితం సంస్థ INNOHUB Technologies మెయిల్స్, వెబ్‌సైట్‌ బ్లాక్ అయ్యాయి. ఉద్యోగులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మోసపోయామని గ్రహించారు. దీంతో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.