ఆర్ఆర్ఆర్'ను చూస్తూ ఒకరు.. 'ఆర్ఆర్ఆర్' కోసం వస్తూ ముగ్గురు - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్ఆర్ఆర్’ను చూస్తూ ఒకరు.. ‘ఆర్ఆర్ఆర్’ కోసం వస్తూ ముగ్గురు

March 25, 2022

yyy

‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వీక్షించడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్, రాంచరణ్ ఫ్యాన్స్ గతకొన్ని రోజులుగా వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు థియేటర్స్ ముందు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాలలో సినిమా విషయంలో విషాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా ఆనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చూస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఓబులేసు అనే వ్యక్తి గుండెపోటుతో ఎస్‌వి మాక్స్ థియేటర్‌లో సినిమా చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో చికిత్స నిమిత్తం ఓబులేసును స్నేహితులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో అతడి సన్నిహితులు, కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు.

మరోపక్క చిత్తూరు జిల్లా వి.కోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తులు’ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను వీక్షించడం కోసం వెళుతున్న నేపథ్యంలో ప్రమాదానికి గురై ముగ్గురు యువకులు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ముగ్గురు తమిళనాడు పెరణంబట్టులో భవన నిర్మాణ కార్మికులగా పని చేసే యువకులుగా గుర్తించారు.