One man went to 56 pubs in 24 hours and set a Guinness World Record
mictv telugu

కీచక డాక్టర్.. ‘చూడాలని ఉంది డ్యూటీకి రారా’

June 14, 2022

One man went to 56 pubs in 24 hours and set a Guinness World Record

మహిళలపై వేధింపులు ఆగడం లేదు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు కూడా కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. ఉద్యోగం చేసుకుంటున్న వివాహితలే టార్గెట్‌గా ఓ వైద్యుడు రెచ్చిపోతున్నాడు. అనంతపురం సప్తగిరి సర్కిల్‌లో ఉన్న ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉన్న సదరు డాక్టరు మహిళా సిబ్బందిని వేధిస్తున్నాడు.

ఆఫీసుకు సెలవు పెడితే.. ‘ఏం నిన్న డ్యూటీకి రాలేదు. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఉంది. డ్యూటీకి రారా బంగారం’, మరో మహిళతో ‘మీ ఆయన విజయవాడలో జాబ్ చేస్తున్నాడంటగా, మరి నీకెలా గడుస్తుంది. ఏంటి సంగతి? అంటూ వెకిలి మాటలతో విసుగెత్తిపోయామని సదరు మహిళా సిబ్బంది వాపోతున్నారు. అతనిపై ఫిర్యాదు చేయాలంటే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న మహిళలు ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయోనని భయంతో మిన్నకుండిపోతున్నారు. అయితే వేధింపులు శ్రుతిమించడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు స్పీడ్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో మౌఖికంగా కూడా తమ బాధలను చెప్పుకున్నారు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి లైంగిక వేధింపుల నుంచి తమను కాపాడాలని బాధితులు కోరుతున్నారు.