దొంగతనం అంటే ఇలా చేయాల్రా అనేంతలా అమెరికాలో దొంగలు రెచ్చిపోయారు. నగల దుకాణంలో చొరబడి ఒకటిన్నర నిమిషం వ్యవధిలో మిలియన్ డాలర్ల బంగారం దోచుకుపోయారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డవడంతో వీడియో వైరల్గా మారింది.
న్యూజెర్సీలోని భారతీయ వ్యక్తి నడిపిస్తున్న బంగారం షాపులో ఎనిమిది మంది దుండగులు ముసుగేసుకొని వచ్చి తుపాకీతో షాపులో ఉన్న మహిళలను బెదిరించి ఈ దురాగతానికి పాల్పడ్డారు. దోచుకున్న సొత్తు విలువ మన కరెన్సీలో 7 కోట్ల 80 లక్షల వరకు ఉంటుందని అంచనా. దోపిడీలో పాల్గొన్న వారంతా 16 నుంచి 20 ఏళ్ల వయసు వారే ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం చుట్టుపక్కల గాలిస్తున్నామని వెల్లడించారు. కాగా, అగ్రరాజ్యమైన అమెరికాలో తుపాకీ సంస్కృతి ఎక్కువగా ఉండడం తెలిసిందే. అమెరికా తరపున వివిధ యుద్దాల్లో పాల్గొని చనిపోయిన సైనికుల కంటే గన్ కల్చర్ వల్ల చనిపోయిన అమెరికన్సే ఎక్కువని అక్కడి నిపుణులు గణాంకాలతో సహా రుజువు చేస్తున్నారు.