ఈ వింతజీవి ఏందిరా బాబోయ్.. (వీడియో)
మనుషులు ఇప్పటివరకు కనుగొనని జీవరాశి సముద్రంలో ఇంకా ఎంతో ఉందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అలాంటి ఎన్నో వింతజీవులు, జలచరాలు తరుచూ కనిపిస్తూ మనుషులను ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి ఓ సముద్ర జీవి అలాస్కాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ద్వీపం తీరంలో ఆగస్టు 15న దర్శనమిచ్చింది.
దీని వీడియోను సారా వాసర్ అల్ఫోర్డ్ అనే మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ‘ఈ సముద్ర జీవి.. స్టార్ ఫిష్ జాతికి చెందిన ‘బాస్కెట్ స్టార్’. ఎలాంటి హానీ తలపెట్టకుండా తిరిగి సముద్రంలోకి వదిలేస్తున్నా’ అని క్యాప్షన్ పెట్టింది. ఈ జీవి ఆక్టోపస్’లా తన శరీరాన్ని సాగదీస్తూ, మెలికలు తిప్పుతూ వింతగా కదులుతోంది. ఇది గ్రహాంతర జీవి అని కొందరు, కాదు, సముద్ర జీవే అని కొందరు చెబుతున్నారు. ‘ఇది సముద్రంలోని పగడపు జీవి.. మెలికలు తిరిగే స్టార్ ఫిష్ .. దాన్ని మళ్లీ సముద్రంలో వదిలేయండి’ అని కోరుతున్నారు.