దీక్షిత్‌ను చంపినట్లే చంపేశారు.. హైదరాబాద్‌లో మరో ఘోరం - MicTv.in - Telugu News
mictv telugu

దీక్షిత్‌ను చంపినట్లే చంపేశారు.. హైదరాబాద్‌లో మరో ఘోరం

October 26, 2020

One more boy missing case in hyderabad

ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కుసుమ దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్య సంఘటనను మరువకముందే హైదరాబాద్‌లో ఇదే తరహా సంఘటన ఒకటి జరిగింది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో అధియాన్(5) అనే బాలుడు ఈ నెల 12న అదృశ్యం అయ్యాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు గౌసియా, సయ్యద్ యూసఫ్‌లు రెండు రోజులపాటు చుట్టుపక్కల వెతికారు. ఇంతలో కిడ్నాప్ చేసిన వ్యక్తి బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు. 

దీంతో వారు 15న స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కొందరు అనుమానితులను విచారించారు. ఇంతలో పోలీసులకు సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ద్ద బాలుడి శవం ల‌భ్య‌మైంది. బాలుడి ఇంట్లో కిరాయికి ఉండే యువ‌కుడే బాలుడిని కిడ్నాప్ చేసి హ‌త్య చేసిన‌ట్లుగా పోలీసులు తెలిపారు. బాలున్ని షేర్ చాట్ వీడియో తీసేందుకు తన ఇంట్లోకి తీసుకుపోయిన ఇంట్లోనే హత్య చేసి, సంచిలో తీసుకొచ్చి ఓఆర్ఆర్ వద్ద పడేసినట్లు పోలీసులు తెలిపారు.