మరో టాలెంట్ నటుడు దొరికినట్టే  - MicTv.in - Telugu News
mictv telugu

మరో టాలెంట్ నటుడు దొరికినట్టే 

August 26, 2017

‘అర్జున్ రెడ్డి’ సినిమా దూసుకుపోతున్నది. ఇందులో హీరోకు దీటుగా అతని ఫ్రెండు శివ ఏ రేంజు యాక్టింగ్ చేసిండని ఎవర్ని అడిగినా చెప్పే ఒకే ఒక్క మాట..  ‘ చింపి టాకలేశిండు కాక’ అని. నిజమే ఆ క్యారెక్టర్ సినిమాకు బ్యాలన్స్ తెచ్చింది.

‘నీతోని దోస్తానా జేస్తే నా ఉచ్చ నామీద పోస్కున్నట్టేరా ’ అన్న శివ డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్ నిండా ఈలలే. మరి ఆ పాత్ర పోషించిది ఎవరనుకుంటున్నారూ?  ‘ సైన్మా ’ అనే ఒకే ఒక్క షార్ట్ ఫిలింతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న యువ నటుడు రాహుల్ రామ్ కుల. అది అతని స్క్రీన్ నేమ్ అయితే అసలు పేరు రాహుల్ రామకృష్ణ . తన సహజసిద్ధమైన నటనతో దూసుకుపోతున్న యువ నటుడు రాహుల్.

రాహుల్..  పక్కా హైదరాబాదీ. సోమాజిగూడా పోరడు. ఇంజనీరింగ్ మధ్యలోనే వదిలేసిండు. రెగ్యులర్ గా చదువుకోవడం తనకు అస్సలు ఇష్టం లేక ఎన్జీవోల తో కలిసి పని చేసిండు. అతనిలో మనకిప్పుడు నటుడు మాత్రమే కనిపిస్తున్నడు గానీ కనిపించని మూడు అవతారాల్లో ఒకటి జర్నలిస్టు, రెండు సమాజ సేవకుగ.., మూడు పాటల రచయిత. అలా ఎన్జీవో కార్యకర్తగా భద్రాచలం చెంచుల అభ్యున్నతి, మహబూబ్ నగర్ వలస బతుకుల నివారణ గురించి చాలా శ్రమించాడు. తర్వాత ఒక ఆంగ్ల పత్రికలో రిపోర్టరుగా పని చేసాడు. అలా కొందరు ఫ్రెండ్స్ ద్వారా తనకు తరుణ్ భాస్కర్ పరిచయమయ్యాడు. వారి పరిచయం ‘ సైన్మా ’ షార్ట్ ఫిలింతో మరింత బలపడింది. సైన్మా షార్ట్ ఫిలిం యూట్యూబ్ లో ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే.

తనకు నటన అనే ఫీల్డుకు గురువు ఎన్. మధుసూదన్ అంటాడు. యాక్టింగ్ లో ఓనమాలు ఆయన దగ్గరే నేర్చుకున్నాడట. తనకు థియేటర్ లో ( నాటకాలు ) కూడా అనుభవం వుంది. రవీంద్ర భారతి వేదికగా నాటకాల్లో నటించిన అనుభవం కూడా వుంది తనకు.

సైన్మా తర్వాత ‘ పెళ్ళి చూపులు ’ సినిమాకు రెండు పాటలు రాశాడు. తనలోని రచయితను కూడా పరిచయం చేసిన మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ అతను.  అలాగే ఆ మధ్య వచ్చిన ‘ జయమ్ము నిశ్చయమ్మురా ’ సినిమాలో కూడా నటించిండు. సైన్మా తర్వాత తనకు అంతగా పేరు తెచ్చిన సినిమా అర్జున్ రెడ్డినే  ఇండస్ట్రీకి కరెక్ట్ నటుడు దొరికాడనే ధీమాను కలిగించిన రాహుల్ కు ఆల్ ది బెస్ట్ చెబుదామా.