దేశంలో పేదల సొమ్ము ఆవిరవుతోంది. ఆర్థిక అసమానతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశంలోని ధనవంతుల వద్ద సొమ్ముపై ఒకేసారి 2శాతం పన్ను విధిస్తే..పోషకాహారంతో బాధపడుతున్న ప్రజలకు మూడేళ్లపాటు ఆహారం అందించడానికి అవసరమైన రూ. 40.423కోట్లు తీర్చవచ్చు. ఇది మేము చెబుతున్నది కాదు..ఆక్స్ఫామ్ ఇంటర్నేషన్లో చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని 1శాతం సంపన్నులు దేశ సంపదలో 40శాతం కలిగి ఉండగా…దేశ జనాభాలో 3శాతం పేదలు ఉన్నారు. దేశంలోని పదిమంది ధనవంతులపై 5శాతం పన్ను విధించినట్లయితే…పేదపిల్లల విద్యకోసం ఖర్చు చేయవచ్చు. అంతేకాదు ధనవంతులు నిత్యావసర వస్తువులు, సేవలపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు తేలింది. మనదేశంలో ప్రజలకు మూడేళ్లపాటు నాణ్యమైన ఆహారం అందించేగలిగే సంపదను మనదేశంలో ఒకశాతంమంది ధనవంతులు కలిగివున్నారని ఆక్స్ ఫామ్ ఇండియా రిపోర్టు వెల్లించింది. ఈ నివేదికలోని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం.
2 శాతం పన్నుతో పోషకాహార లోపం ఉన్నవారికి ఆహారం:
ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్ నివేదిక ప్రకారం, భారతదేశంలోని ధనవంతులకు ఒకసారి 2 శాతం చొప్పున పన్ను విధిస్తే, రాబోయే మూడేళ్లలో దేశంలోని పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజలకు ఆహారం అందించడానికి రూ.40,423 కోట్లు అవసరమవుతాయి. అదే సమయంలో దేశంలోని 10 మంది సంపన్న బిలియనీర్లపై ఒకేసారి 5 శాతం పన్ను విధించడం ద్వారా రూ.1.37 లక్షల కోట్లు అందుతాయి. ఇది ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (రూ. 86,200 కోట్లు) ఆయుష్ మంత్రిత్వ శాఖ (రూ. 3,050 కోట్లు) అంచనా వేసిన డబ్బు కంటే 1.5 రెట్లు ఎక్కువగా పేర్కొంది.
మహిళా కార్మికులకు తక్కువ వేతనాలు
భారతదేశంలో లింగ అసమానత ఇంకా కొనసాగుతోందని ఈ నివేదిక పేర్కొంది. ఇక్కడ ఒక పురుష కార్మికుడు సంపాదించే ప్రతి రూపాయికి మహిళా కార్మికులకు 63 పైసలు మాత్రమే లభిస్తాయి. భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 2020లో 102 నుండి 2022 నాటికి 166కి పెరుగుతుందని కూడా నివేదిక పేర్కొంది. కోవిడ్ మహమ్మారి నుండి నవంబర్ 2022 వరకు, భారతదేశంలో బిలియనీర్ల సంపద వాస్తవ పరంగా 121 శాతం లేదా రోజుకు రూ. 3,608 కోట్లు పెరిగిందని ఆక్స్ఫామ్ తన నివేదికలో తెలిపింది.