ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ ఆలయ సందర్శనకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. జగన్ ఆలయం వెలుపల నిల్చుని కింద ఉన్నవారికి అభివాదం చేస్తున్నట్లుగా ఉంది. అయితే కింద ఎవరికి ఆయన అభివాదం చేస్తున్నారనే విషయం వీడియో చూసిన వారెవరికీ అర్ధం కావడం లేదు. కారణం.. అక్కడ ఎవరూ లేరు. ఆ వీడియో చూసిన నెటిజన్లు జగన్ తీరును చూసి నవ్వుకుంటున్నారు. అసలు అక్కడ ఎవరున్నారని జగన్ చేతులెత్తి మరీ దణ్ణం పెడుతున్నారో అర్థం కాక బుర్ర బాదుకుంటున్నారు.
వీడియోలో జగన్‌తో పాటు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి రోజా ఉన్నారు. ఈ వీడియోను కొన్ని మీమ్స్ పేజ్‌లు.. ఖలేజా సినిమాలో ‘అక్కడ ఎవరూ లేరు కదా సార్’ అని బ్రహ్మానందం చెప్పే డైలాగ్‌ను జత చేసి వైరల్ చేస్తున్నాయి. అయితే.. జగన్‌కు సంబంధించిన ఈ వీడియోను కావాలనే ఎడిట్ చేశారని.. జనం లేనట్టుగా చూపిస్తున్నారని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ వైరల్ వీడియోను కొట్టిపారేస్తున్నాయి.
Wait for it 🙏🙏😂 pic.twitter.com/vcD4nPTGzK
— Vaibhav Jain (@1997Indian) June 26, 2022