లక్ష్మీపార్వతి, పూనంలను వేధించింది ఒక్కడే - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష్మీపార్వతి, పూనంలను వేధించింది ఒక్కడే

May 15, 2019

నటి పూనం కౌర్‌, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతిలను కొందరు సోషల్ మీడియాలో వేధించిన కేసులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుడిని గుర్తించారు. ఇద్దరినీ వేధించింది ఒక్కడేనని ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌‌లలో అశ్లీల కథనాలు, అసభ్యకర రాతలు పోస్ట్‌ చేస్తున్నారంటూ లక్ష్మీపార్వతి, పూనం కౌర్‌ వేర్వేరుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

వారి దర్యాప్తులో పూనం కౌర్‌ ఫిర్యాదులో పేర్కొన్న ఒక వ్యక్తి పేరు, లక్ష్మీపార్వతిని వేధించిన నిందితుడి పేరు ఒకటేనని గుర్తించారు. అతడితో పాటు మరోవ్యక్తికి కూడా ఈ నేరంలో భాగస్వామ్యం వుందని తేల్చారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లక్ష్మీపార్వతిపై, గత 8 నెలలుగా పూనం కౌర్‌పై అసభ్యకర పోస్టులు, అశ్లీల కథనాలను పోస్ట్‌ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. వాళ్లు హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌ ఫ్టాట్‌లో ఆఫీస్ నిర్వహిస్తున్నారు. వారు ఇదంతా డబ్బు కోసమే చేశారా? లేకపోతే మరేమైనా కారణం వుందా? వారి వెనకాల వున్నదెవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.